HomeNewsBreaking Newsప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే దక్కెలా రిజర్వేషన్‌ కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ‘75 శాతం స్థానిక కోట’ చట్టాన్ని తీసుకురావాలని, ప్రైవేటు రంగంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు?, ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నా రో స్పష్టం చేయాలని రౌండ్‌ టేండ్‌ సమావేశం తీర్మానం చేసింది. ‘తెలంగాణ ప్రైవేట్‌ రంగం- ఉద్యోగాలలో 75 శాతం స్థానిక కోట చట్టం’ అనే అంశంపై తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో సోమవారం రౌండ్‌ టేండ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కాంగ్రెస్‌ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌, ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజెయు) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రైవేటు ఉద్యోగ సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు సామవెంకట్‌ రెడ్డి, అధ్యక్షుడు నాగేశ్వర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడు తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజలు బాగుపడతారని భావించామని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడే హింసకు దారితీస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానాన్ని ధ్వంసం చేస్తోందని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతూ రూ. 5 భోజనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో హింస లేకుండా శాంతియుత పాలన కొనసాగుతుందన్నారు. కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పడం నిజమేనని, అయితే, కనీసం అందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రభుత్వ ఖజానా నుంచే అయినందున, ప్రాంతీయ వాసులకు ఉద్యోగాల రిజర్వేషన్‌ కల్పించడంలో మీనమేషాలు లెక్కపెట్టాల్సిన పని లేదన్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో 70 నుంచి 80 శాతం మధ్య స్థానికులకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి చట్టాలు చేశారని గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న మన రాష్ట్రంలో దానిని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్‌టిసి కార్మికుల పరిస్థితి దారణంగా మారిందన్నారు. ఎపిలో 75 శాతం స్థానిలకు రిజర్వేషన్‌ తీసుకొచ్చారని, తెలంగాణ నిరుద్యోగులకు 75 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రధాన అంశంగా పొందపరుస్తామని హామీనిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments