HomeNewsAndhra pradeshఎల్లో అలర్ట్‌

ఎల్లో అలర్ట్‌

రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
వాతావరణ శాఖ ప్రకటన
ప్రజాపక్షం/హైదరాబాద్‌

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కూడా మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయన్నారు. ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగతా చోట్ల కూడా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయన్నారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశామన్నారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. సోమ, మంగళవారాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments