HomeNewsBreaking Newsరాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చివేసే యత్నం

రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చివేసే యత్నం

కార్పొరేట్‌ వర్గాల మెప్పు కోసం కేంద్రం ఆరాటం
ప్రజాపక్షం సంపాదకులు కె. శ్రీనివాస్‌రెడ్డి

ప్రజాపక్షo/వరంగల్‌ ప్రతినిధి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, స్ఫూర్తికి విరుద్ధంగా జరిగే మార్పు అణగారిన వర్గాలపై దాడి లాంటిదేనని ప్రజాపక్షం దినపత్రిక సంపాదకులు, ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఐజెయు) జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో ఈ నెల 14 నుండి 18 వరకు జరుగుతున్న సందర్భంగా ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌ సమావేశ మందిరంలో ‘రాజ్యాంగ పరిరక్షణ సదస్సు’ జరిగిం ది. ఈ సదస్సుకు సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కె. శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక సూత్రాలు మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు జరిగితే కోర్టులు జోక్యం చేసుకుంటాయని అన్నారు. దేశంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని తమకు నచ్చిన రీతిలో మార్చే కుట్ర జరుగుతున్నదని అన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చడం, భావప్రకటన స్వేచ్ఛను హరించివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తే, ఎన్నికలలో ఓటమి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, లౌకిక వాదం వంటి కీలక అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చడానికి తాము అధికారంలో వచ్చామని బిజెపి కర్ణాటక ఎంపి అనంత్‌ హెగ్డే చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజల మధ్య సౌభ్రాతృత్వం ఉండాలని, కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించరాదని అన్నారు. చట్ట సభలలో మెజారిటీ వచ్చినంత మాత్రాన ప్రభుత్వాలు ప్రజలపై బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్దడం సరికాదన్నారు. అమెరికా లాంటి దేశంలో అందరికీ విద్య, తదితర అన్ని అవకాశాలు సమానంగా ఉంటాయని, మన దేశంలో మాత్రం అది జరుగడం లేదని అన్నారు. ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్న రాజ్యాంగ లక్ష్యాలను చెత్తబుట్టలో పడేశారని, దేశ సంపదను పేదలకు కాకుండా కార్పొరేట్‌ వర్గాలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. దీంతో స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని అన్నారు. ఆదానీ ఒక రోజు ఆదాయం రూ. 1,064 కోట్లుగా ఉందని, ఆ తరువాత స్థానంలో అంబానీ ఉన్నారని తెలిపారు. దేశంలోని 125 కోట్ల మంది జనాభాలో ఎవరికీ రాని ఆదాయం వీరికి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. పేదవారు 60 గజాల ఇంటి స్థలం అడిగితే కేసులు పెడుతున్నారని, పాలకులను ప్రశ్నిస్తే అర్బన్‌ నక్సల్స్‌ అని ముద్ర వేస్తూ దేశద్రోహం కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘రాజ్యాంగాన్ని గుర్తించని వాళ్ళు, జాతీయ జెండాను ఎగురవేయని వాళ్ళు దేశ భక్తులా? రాజ్యాంగాన్ని ఆచరించే వాళ్ళు దేశ ద్రోహులా?’ అని నిలదీశారు. ఇలాంటి అంశాలను మనం గుర్తించకపోతే భవిష్యత్తు పరిణామాలను ఎదుర్కోవడం సాధ్యం కాదన్నారు. ఈ సదస్సులో సిపిఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రిటైర్డ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మార్క శంకర్‌ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, మాజీ ఎంఎల్‌ఎ పోతరాజు సారయ్య, వరంగల్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాల కార్యదర్శులు మేకల రవి, బి. విజయ సారథి, కె. రాజ్‌ కుమార్‌, బికెఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోతె లింగారెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు బి. అజయ్‌, తోట బిక్షపతి, ఎస్‌కె బాష్‌ మియా, నల్లు సుధాకర్‌ రెడ్డి, ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ నాయకులు అశోక్‌ స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నార

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments