HomeNewsBreaking Newsఇక్కడ సీట్లు ఇవ్వలేం

ఇక్కడ సీట్లు ఇవ్వలేం

ఉక్రేన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్రం చేదు వార్త
న్యూఢిల్లీ:
రష్యా సైనిక చర్యకు దిగడంతో ఉక్రేన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రేన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా కేంద్రం వెనక్కు తీసుకొచ్చింది. అక్కడ పరిస్థితు లు ఇంకా చక్కబడకపోవడంతో, దేశంలో విద్యను కొనసాగించడానికి అనుమతిస్తారని వైద్య విద్యార్థులు ఆశించారు. వీరికి న్యాయం చేయాలంటూ సుప్రీం కోర్టు లో పలు పిటిషన్లు దాఖల య్యాయి. వాటిపై శుక్రవారం విచారణ కొనసాగించనున్న నేపథ్యంలో, గురువారం సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. దేశంలో అమలు చేస్తున్న నిబంధనలు, విధివిధాలను అనుసరించి, ఉక్రేన్‌లో చదువుతూ, ఇప్పు డు స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సీట్లు కేటాయించే అవకాశం లేదని అందులో కేంద్ర సర్కారు ఆ అఫిడవిట్‌లో తేల్చిచెప్పింది. పేరొందిన వైద్య కళాశాలు అంతగా ప్రతిభలేని విద్యార్థులను చేర్చుకోవడానికి సిద్ధపడవని, అడ్మిషన్‌ విధానాలను మార్చడం కూడా సాధ్యం కాదని వివరించింది. అంతేగాక ఉక్రేన్‌తో పోలిస్తే భారత్‌లో ఫీజు చాలా ఎక్కువకాబట్టి, విద్యార్థులు ఇంత మొత్తాలను భరించడం కష్టమని పేర్కొంది. యుద్ధాలు వంటి విపత్కర పరిస్థితుల్లో, విదేశాల్లో చదువును నిలిపేసి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు దేశంలో చదువును కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని జాతీయ మెడికల్‌ కమిషన్‌ ఈనెల 6వ తేదీన విడుదల చేసిన ప్రకటనను కూడా కేంద్రం ఈ అఫిడవిట్‌లో ప్రస్తావించింది. దీని ద్వారా దొడ్డిదారిన ఇక్కడ వైద్య కళాశాలల్లో సీట్లు పొందవచ్చని అనుకోవడం పొరపాటేనని తెలిపింది. ఉక్రేన్‌ అనుమతి తీసుకొని, ఇతర దేశాల్లో ఈ విద్యార్థులు చదువును కొనసాగించేందుకు సహకరిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం వివరించింది. అఫిడవిట్‌ను స్వీకరించిన తర్వాత జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశు ధులియాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేసును వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments