HomeNewsBreaking Newsసింగరేణి కాంట్రాక్టు కార్మికులు మోకాళ్లపై నిల్చొని నిరసన

సింగరేణి కాంట్రాక్టు కార్మికులు మోకాళ్లపై నిల్చొని నిరసన

కార్మికులను క్రమబద్ధీకరించాలి
సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌
ఏడవ రోజూ కొనసాగిన నిరవధిక సమ్మె

ప్రజాపక్షం/కొత్తగూడెం రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఇచ్చి న హామీల అమలుకోసం నిరసనల గళం విప్పుతున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులను నిర్బంధిస్తూ… అరెస్టులకు పాల్పడటం సరికాదని, నిరంకుశ విధానాలకు స్వస్తి చెప్పి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సిం గరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పేర్కొంది. వేతన జిఒలను అమ లు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధికరించాలని, సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. విధులకు స్వస్తి చెప్పిన కాంట్రాక్టు కార్మికులు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. మోకాళ్ళపై నిల్చొని యాజమాన్య, ప్రభుత్వ నిర్లక్ష్యపు విధానాలను నిరసించారు. ఈ సందర్భంగా సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాషా మాట్లాడుతూ వారం రోజులుగా సమ్మె జరుగుతుంటే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నా రు. కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, యాజమాన్య, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెబాట పట్టారని, నిర్లక్ష్యం చేస్తుండటం వల్లే కార్మికులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సమ్మెనోటీసుపై కేంద్ర కార్మిక శాఖ అధికారి సమక్షంలో పలుమార్లు చర్చలు జరిపిన యాజమాన్యం… వేతనాలు పెంచుతామని హామీనిచ్చి మొండిచేయి చూపిన ఫలితంగానే కార్మికులు సమ్మెబాట పట్టారన్నారు. కా్రంటాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఏండ్లు గడుస్తున్నా ఆ హామీని అమలు చేయకుండా కార్మికులను మో సం చేశారని ఆరోపించారు. కోల్‌ ఇండియాలో హైపర్‌ కమిటీ వేతనాలు అమలవుతుంటే సింగరేణి సంస్థలో మోకాలడ్డేది ఎవరని ప్రశ్నించారు. కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యానికి గానీ, ప్రభుత్వానికి గానీ చిత్తశుద్ధిలేదని, అరకొర వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా సమ్మె విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, ఎంతటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ధర్నాలో జెఎసి కన్వీనర్‌, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, సిఐటియు నాయకులు ఎర్రగాని కృష్ణయ్య, ఇఫ్టూ నాయకులు పి.సతీష్‌, కందగట్ల సురేందర్‌, బిఎంఎస్‌ నాయకులు ఇనుమూరి నాగేశ్వర్‌రావు, హెచ్‌ఎంఎస్‌ నాయకులు బి.రమేష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు అంజనేయులు, పిట్టల రాంచందర్‌, నిర్మల, మల్లికార్జున్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments