మంత్రులు, ఎంఎల్ఎలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించిన యుపిఎ కూటమి
రాంచీ : జార్ఖండ్ రాష్ట్రంలో యుపిఎ తన సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆశ్చర్యపరచేవిధంగా శాసనసభ్యులను ముఖ్యమంత్రి తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. బిజెపి బారి నుండి కాపాడుకోవడానికే వారిని మరో ప్రాంతానికి తరలించినట్లు యుపిఎ వర్గాలు మంగళవారంనాడు తెలియజేశాయి. ఈసారి రాష్ట్ర కేబినెట్ మంత్రులతోపాటు 31 మంది ఎంఎల్ఎ లను పొరుగున
చత్తీస్‌గఢ్‌కు తరలించారు. ఇంతకుముందు కొద్ది గంటలు మాత్రమే హేమంత్ సోరెన్ తమ ఎంఎల్ఎలను విహార యాత్ర పేరిట మరో ప్రాంతానికి తరలించారు. బిజెపి మరోసారి వారపై బేరసారాల యత్నాలు చేయడంతో యుపిఎ ప్రభుత్వం అప్రమత్తమై ఈ చర్యలు తీసుకుంది. రాంచీ విమానాశ్రయం వరకూ వారిని బస్సులు ఎక్కించి తరలించారు. అక్కడి నుండి ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌కు తరలించారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉండగా, 49 మంది ఎంఎల్ఎలు అధికార యుపిఎ కూటమిలో ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో వారిని రాయపూర్ తరలించారు. “నిజంగా ఇది ఆశ్చర్యకరమైన సంఘటనే, రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతాయి, మేం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం” అని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీ విమానాశ్రయం నుండి బయటకు వస్తూ పాత్రికేయులతో అన్నారు. అయితే నిర్ణీత ప్రకారం సెప్టెంబరు 1వ తేదీన జార్కండ్ మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది.
శాసనసభ్యులందరరూ ముఖ్యమంత్రి నివాసం నుండి రెండు బస్సుల్లో రాంచీ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నది బిజెపి యేతర ప్రభుత్వమే గనుక తమ ఎంఎల్ఎలకు ఎలాంటి హానీ జరగదని సోరెన్ భావించారు. మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే అనుసరించిన వ్యూహాన్నే యుపిఎ సంకీర్ణ కూటమి కూడా అవలంబించింది. తమ ఎంఎల్ఎలను ఆకర్షించేందుకు బిజెపి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని సోరెన్ విమర్శించారు. ఆగస్టు 25వ తేదీన జార్కండ్ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్‌కు ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని పంపించింది. సోరెన్ శాసనసభ్యత్వానికి అనర్హుణ్ణి చేయాలని కోరింది. అయితే ఇంతవరకూ గవర్నర్ అధికారికంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై జార్కండ్ రాజ్‌భవన్ నుండి ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే ఈ విషయంపై నెలకున్న గందరగోళానికి తెరదించాలని, ఒక ప్రకటన చేయాలని, తాము ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడేందుకు ఈ ప్రకటన చాలా అవసరమని యుపిఎ సంకీర్ణ కూటమి ఎంఎల్ఎలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 28న యుపిఎ భాగస్వామ్యపార్టీలు ఒక ఉమ్మడి ప్రకటన చేస్తూ, గవర్నర్ స్వయంగా రాజకీయంగా ఎంఎల్ఎల కొనుగోళ్ళకు ఆస్కారం కలిగిస్తున్నారని, అందుకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించాయి. ముఖ్యమంత్రి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసే విషయంపై ఉద్దేశపూర్వకంగా ప్రకటన చేయకుండా గవర్నర్ జాప్యం చేస్తున్నారని విమర్శించాయి.
జార్ఖండ్‌లో క్యాంపు రాజకీయాలు
RELATED ARTICLES