న్యూయార్క్: నాలుగు గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీల్లో చివరిదైన యుఎస్ ఓపెన్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌కు వీడ్కోలు పలికేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కెరీర్‌లో అత్యధికంగా 23 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను అందుకున్న సెరెనా, 24 టైటిళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న మార్గరెట్ కోర్ట్ సరసన చేరేందుకు కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. యుఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు సెరెనా ఇది వరకే ప్రకటించింది. ఆమె మనసు మార్చుకుంటే తప్ప, ప్రస్తుతానికి మాత్రం ఇదే ఆమెకు చివరి గ్రాండ్ శ్లామ్. మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయడానికి కూడా ఇదే చివరి అవకాశం. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌ను ‘గ్రాండ్ శ్లామ్’ టోర్నీలుగా పేర్కొంటారు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో 7, ఫ్రెండ్ ఓపెన్‌లో 3, వింబుల్డన్‌లో 7 చొప్పున టైటిళ్లు సాధించిన సెరెనా ఖాతాలో 6 యుఎస్ ఓపెన్ టైటిళ్లు కూడా ఉన్నాయి. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల సమక్షంలో చివరి ఆడుతున్న ఆమెకు సంపూర్ణ మద్దతు లభించడంలో ఆశ్చర్యం లేదు. కాగా, రాఫెల్ నాదల్, డానియల్ మెద్వెదెవ్, ఎమ్మా రాడుకాను, నవోమీ ఒసాకా తదితరులు కూడా తమతమ విభాగాల్లో టైల్ వేట కొనసాగించనున్నారు. అయితే, సానియా మీర్జాతోపాటు జర్మనీ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్, ఏంజెలిక్ కెర్బర్ తదితరులు వివిధ కారణాలతో ఈసారి యుఎస్ ఓపెన్‌కు దూరమయ్యారు. కరొనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా నొవాక్ జొకోవిచ్‌ను నిర్వాహకులు టోర్నమెంట్‌కు అనుమతించలేదు.
సెరెనాకు వీడ్కోలు టోర్నీ
RELATED ARTICLES