కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్స్‌పై ఎంతో గ్రాండ్‌లెవెల్‌లో తెరకెక్కిన మూవీ ది ఘోస్ట్. సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో నాగార్జున ఒక రాఏజెంట్గా కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ నుండి సూపర్‌గా రెస్పాన్స్ అందుకోగా నేడు ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసారు. ‘ఊటీ నుండి ఫోన్ వచ్చింది, తమ్ముడిగా నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని మాటివ్వు అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో ది ఘోస్ట్ ట్రైలర్ ఆరంభం అవుతుంది. పని కావడం లేదు చంపేయి’ ‘కిడ్నాపర్స్, మర్దరర్స్, గ్యాంగ్ స్టర్స్ అండర్‌వరల్డ్ మొత్తం ఒక్కటే అంది’ ‘చావుని చాలా సార్లు చాలా దగ్గరగా చూసాను ప్రియా అంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అండర్‌వరల్డ్ మాఫియాని మట్టుబెట్టే పాత్రలో ఇందులో రా ఆఫీసర్‌గా నాగ్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. పవర్‌ఫుల్‌గా సాగే ఈ ట్రైలర్లో యాక్షన్, ఛేజింగ్ సీన్స్, ఫైట్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా యక్షన్, ఎమోషన్, థ్రిల్లింగ్ అంశాలతో అలరించిన ది ఘోస్ట్ మూవీ ట్రైలర్, మూవీపై అందిరిలో మరింతగా అంచనాలు ఏర్పరిచింది అని చెప్పవచ్చు. కాగా ఈ మూవీని అక్టోబర్ 5 వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు.
పవర్‌ఫుల్‌గా నాగ్ ‘ది ఘోస్ట్’ ట్రైలర్
RELATED ARTICLES