HomeNewsBreaking Newsఆత్మగౌరవంతో బతికేందుకే…

ఆత్మగౌరవంతో బతికేందుకే…

రాష్ర్టంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పంపిణీ : మంత్రి హరీశ్‌రావు
మెదక్‌లో లబ్ధిదారులకు 500 ‘డబుల్‌ బెడ్‌’ పట్టాలు అందజేత
ప్రజాపక్షం/మెదక్‌
నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌లను అందిస్తుందని, పేదల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం మెదక్‌ పట్టణ శివారులోని పిల్లికోటల్‌లో ప్రభుత్వం నిర్మించిన 500 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌లతో కలిసి మంత్రి హరీశ్‌ రావు,పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లో గృహ ప్రవేశాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ కులం, మతం ఏదైనా పేదలందరూ ఆత్మ బంధువులని, వారి సంక్షేమమే ముఖ్యమన్నారు. పైసా ఖర్చు లేకుండా, చమట చుక్క రాలకుండా గృహ ప్రవేశాలు చేయించిన ఘనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్‌, బిజెపి పాలిత రాష్ట్రాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తున్నారనా అయని ప్రశ్నించారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు లక్షలు ఇస్తామని మంత్రి చెప్పారు. మెదక్‌ జిల్లాలో లక్షా 6 వేల మందికి కొత్తగా 21 వేల కొత్త పింఛన్లు మంజూరయాయ్యని చెప్పారు. త్వరలో లబ్ధిదారులకు అందిస్తామని సూచించారు. మెదక్‌లో కొత్త ఎంసిహెచ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశామన్నారు. బిజెపి ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు పెద్ద పెద్ద కంపెనీలకు మాఫీ చేసిందని, పేదలకు పెట్టేవారు కావాలా? పెద్దలకు పెట్టేవారు కావాలా అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మతం చూసి ఇస్తున్నామా?, కులం చూసి ఇస్తున్నామా? అందరికీ ఇస్తున్నామన్నారు. బిజెపి ప్రభుత్వం 157 మెడికల్‌ కాలేజీలు ఇస్తే… అందులో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నవోదయ విద్యాసంస్థలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అంతకుముందు ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ పేదల కోసం పాటుపడుతున్నారని, భవిష్యత్‌లోనూ టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ మెదక్‌లో పేదల కల సాకారమైందని, 500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రెండవ విడత మరో 500 దసరా రోజున పంపిణీ చేయడం జరుగుతుందని సూచించారు. రాని వారు ఆదర్యపడొద్దని అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ అడిషినల్‌ కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, జెడ్‌పివైస్‌ చైర్మన్‌ లావణ్య రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌ గౌడ్‌ ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments