కట్టు తప్పిన వర్షాలతో రైతుల్లో ఆందోళన
బెంగపడొద్దని నిపుణుల భరోసా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశంలో ఖరీఫ్ (సార్వాపంట) నాట్లు ఆలస్యమయ్యేలా ఉన్నాయి. వర్షాలు నియమం తప్పి, అస్వాభావికమైన పద్ధతుల్లో కురుస్తూ ఉండటంతో దేశంలో ఈ ఏడాది సరికొత్త పరిస్థితి తలెత్తింది. జులై మొదటి అర్థభాగంలో పొందికలేకుండా రుతు సప్రదాయ విరుద్ధంగా వర్షాలు ఒకేసారి వచ్చి పడటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ రుతువులో విడతలవారీగా నమోదు కావాల్సిన వర్షపాతం ప్రకారం 14 శాతం అదనపు వర్షపాత నమోదైంది. అయితే పంట ఉత్పత్తుల విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఆహార భద్రత, ద్రవ్యోల్బణం గురిం చి బెంగపెట్టుకునే అవసరం లేదని వాతావరణ, వ్యవసాయ నిపుణులు భరోసా ఇస్తున్నారు. జులై 15వ తేదీనాటికి వరిపంట సాగు గత ఏడాదిలో 155.53 లక్షల హెక్టార్లలో దేశంలో సాగుకాగా, ఈ ఏడాదిలో 17.38 శాతానికి అంటే 128.50 లక్షల హెక్టార్లకు తగ్గిపోయిందని కేంద్ర వ్యవసా య మంత్రిత్వశాఖ గణాంకాలు తెలియజేశాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ఖరీఫ్ నాట్లు జాప్యమయ్యాయని, ఈ నెలలోనే మిగిలిన 38 లక్షల హెక్టార్లలో నాటు పడే అవకాశం ఉంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నెలలోనే రుతుపవన ప్రభావంతో వర్షాలు పురోగతిలోనే ఉంటాయని పేర్కొంది. ఈ వర్షాకాలంలో దేశంలో 70 శాతం వర్షాలు నమోదవుతాయి. ఈ సమయానికి నాట్లలో 60 శాతం మేరకు పూర్తి అవుతాయి. దేశంలో సుమారు సగానికి సగంమంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వాతావరణశాఖ అంచనాల ప్రకారం దేశంలో ఈ ఏడాది సాధారన వర్షపాతమే నమోదు అవుతుంది. అయితే రుతుపవన ప్రభావం ప్రకారం జూన్ 1న ఈ సీజన్ మొదలయ్యాక ఇప్పటివరకూ 14 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. అయితే ప్రాంతాలవారీగా కురిసే వర్షపాతం విలువలో చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒక ప్రాంతంలో చాలా హెచ్చుస్థాయిలో, మరో ప్రాంతంలో చాల స్వల్పస్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. దక్షిణ భారతదేశం, మధ్యభారతదేశ రాష్ట్రాల్లో ఇప్పటివరకూ అదనపు వర్షపాతం నమోదైంది. తూర్పు, ఈ శాన్య భారతదేశ రాష్ట్రాలలో ప్రాంతాలవారీగా వర్షపాతం నమోదులో సంప్రదాయ విరుద్ధంగా తీవ్రమైన లోటు ఏర్పడింది. వరిపంట పండించే ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వర్షపాతంలో తీవ్రమైన లోటు ఏర్పడిందని స్కైమెట్ వెదర్ (వాతావరణ, వాతావరణ మార్పులు) వైస్ ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ 45 రోజుల్లో సాధారణంగా జులై 15 నాటికి కురవాల్సిన వర్షం కంటే 65 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలలో వరుసగా 42 శాతం, 24 శాతం, 49 శాతం వంతున వర్షపాతంలో లోటు ఏర్పడింది. ఈ రాష్ట్రాలలో వర్షపాతంలో తీవ్రమైన లోటు వల్ల ప్రధానంగా వరిపంట నాట్లు తీవ్ర జాప్యం అవుతాయి. దీనివల్ల పంట చేతికి వచ్చేసమయంలో మళ్ళీ పదునుమీద ఉండే పంట వర్షాల బారిన పడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాలలో వరినాట్లలో జాప్యం జరిగింది. అయితే ఇంకా కొంత సమయం మిగిలే ఉందని ఆహార, వాణిజ్య విధానపరమైన నిపుణుడు దేవిందర్ శర్మ పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. ఒకవేళ ఈ రుతువులో మిగిలిన వర్షపాతం కూడా కురిసే విషయంలో ఊహించని పరిస్థితులు ఉంటే అది కచ్చితంగా పంట దిగుబడిపై ప్రభావం చూపిస్తుందన్నారు. అవసరమైన సమయంలో వర్షపాతం కొరత, లేదా అస్సలు కురవకపోవడం వంటి పరిస్థితులవల్ల కచ్చితంగా పంటదిగుబడికి నష్టం కలుగుతుందని అన్నారు. ఈ సీజన్‌కు ముందు వేసవికాలం రాకముందే వేడిగాలులు దేశంపై తీవ్రప్రభావం చూపించడంతో ఇప్పటికే దాళ్వా (రబీ క్రాప్) పంటకు తీవ్ర నష్టం జరిగింది. దాంతో ప్రభుత్వం ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి గోధుమల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. ఉత్పత్తి అంచనాలను కూడా రమారమీగా ఐదూశాతం మేరకు అంటే 11.13 కోట్ల టన్నుల నుండి 10.64 కోట్ల టన్నులకు తగ్గించుకుంది. దేశంలో దురదృష్టకరమైన పరిస్థితుల్లో వరిపంట దిగుబడుటు గణనీయంగా దెబ్బతింటే దాన్నుండి బయటపడేందుకు వీలుగా గోధుమ ఎగుమతులను నియంత్రించవలసి ఉంటుందని, ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ వర్షపాత పరిస్థితులను దృష్టిలోపెట్టుకునే నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని శర్మ చెప్పారు. దేశం మొదట తన జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవాలన్నారుప్రపంచదేశాల్లో ప్రస్తుతం అనూహ్యమైన పరిస్థితులు నెలకున్నాయి. వాతావరణపరిస్థితులు సమతుల్యంగా ఉండకుండా భీకరంగా, క్రూరంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు విరీతంగా పెరుగుతున్నాయి. ప్రకృతి నియమాలు ఏటికేడాది మారిపోతున్నాయి. ప్రకృతి నియమం ప్రకారం ప్రవర్తించకుండా ఒకేసారి విరుచుకుపడేలా స్పందిస్తోంది. వర్షపాతం సమతుల్యంగా ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిదేశం ఆరోగ్యకరమైన ప్రామాణికతలకు అనుగుణంగా నిల్వలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అయితే భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాలకంటే ఎక్కువ బియ్యాన్ని ఎగుమతి చేసే దేశంగా వాణిజ్య జాబితాలో నమోదైంది. ప్రపంచబియ్యం ఎగుమతిలో 37 శాతం వాటా భారత్‌కే ఉంది. భారత వ్యవసాయ పరిశోదనా సంస్థ (ఐఎఆర్ఐ) మైక్రోబయాలజీ విభాగాధిపతి కె.అన్నపూర్న దీనిపై స్పందిస్తూ, ఖరీఫ్ నాట్లు కాలం పూర్తయ్యేవరకూ ఏ విధమైన ఊహాగానాలు చేయడం మంచిదికాదని అన్నారు. దేశంలో పంటసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ దిగుబడిలో మాత్రం ఎలాంటి లోటూ రాలేదని ఆమె గుర్తు చేశారు. చీడపీడను తట్టుకుని నిలబడగల రకాలను సాగు చేయడంవల్ల దేశం అత్యధికమైన పంట దిగుబడులు సాధిస్తోందని ఆమె ధీమాగా చెప్పారు. ఇప్పుడు తాను నాట్ల గురించి కంగారు పడటం లేదని, జులై చివరివరకూ మనకు గడువు ఉందని అన్నారు. భారతదేశంలో ప్రజలకు సరిపడినస్థాయిలో గోదాములలో గోధుమ నిల్వలు ఉన్నాయని ఆమె అన్నారు. విపరీతమైన వేడిగాలు దేశంపై దాడిచేసినప్పటికీ మనకు నష్టం రాలేదన్నారు. అదేవిధంగా పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ వాతావరణ విభాగం ప్రొఫెసర్ కె.కె.గిల్ స్పందిస్తూ, దేశంలో 98 శాతం వ్యవసాయ భూమి నీటిపారుదల వ్యవస్థకు అనువైన, ఎలాంటి భయాందోళనలు అవసరంలేని రక్షిత ప్రదేశాల్లోనే ఉందని అన్నారు. అందువల్ల రైతులు పెద్దగా వర్షపాతంపై ఆధారపడకపోయినా సాగునీటి పారుదలావ్యవస్థ పూర్తి భరోసా ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఖరీఫ్ నాట్లు జాప్యం
RELATED ARTICLES