అగ్నిపథ్‌పై చర్చకు డిమాండ్
న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్షాలు హాజరు కాలేదు. అయితే ‘అగ్నిపథ్’ పథకంసహా నిరుద్యోగం, ధరలు, రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చకు అనుమతించాలని, ఆ అంశంపై సభలో చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తునాయి. ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరిస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన చేయకపోయినప్పటకీ శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో, సభ్యులు సభా మర్యాద కాపాడాలని, క్రమశిక్షణతో మెలగాలని ఆయన కో రారు. ప్రజాప్రయోజన సమస్యలపై చర్చ చేస్తామని ఆయనఅనా రు. సోమవారం నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారం భమవుతూ ఉండటంతో ఓంబిర్లా అఖిలపక్షం ఏర్పాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్,
శివసేన, ఎన్‌సిపి, బిఎస్‌పి, సమాజ్‌వాదీపార్టీ, తెలుగుదేశంపార్టీ, శిరోమణి అకాలీదళ్‌పార్టీల నాయకులు, వామపక్షాల నాయకులు స్పీకర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి గైరుహాజరయ్యారు. అయితే కాంగ్రెస్‌పార్టీ ఆ పార్టీ మిత్రులు డిఎంకె, ఐయుఎంఎల్ పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొనారు.సభ్యులు చర్చల సందర్భంగా సభాగౌరవాన్ని కాపాడేవిధంగా ప్రవర్తించాలని, క్రమశిక్షణ పాటించాలని స్పీకర్ కోరారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు అగ్నిపథ్‌పై సభలో చర్చకు అనుమతించాలని సీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, ఈ సమస్యపై అనివార్యంగా చర్చ జరగాల్సి ఉందని సభ్యులు కోరారు కాంగ్రెస్‌పార్టీ తరపున అధీర్ రంజన్ చౌధురి, డిఎంకె పార్టీ తరపున టి.ఆర్.బాలు సమావేశానికి హాజరయ్యారు. అగ్నిపథ్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, అందుకు అంగీకరించాలని అధీర్ రంజన్ చౌధురి కోరారు. రైతు సమస్యలపైన, నిరుద్యోగంపైనా కూడాచర్చ జరగాల్సిదేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడేందుకు అందరికీ తగినంత సమయం కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 18 రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయని 108 గంటలు మాత్రమే సమయం ఉందని స్పీకర్ ఆయనకు తెలియజేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ, ఎన్‌డిఎ భాగస్వామ్య ఎల్‌జెపి, అప్నాదళ్ పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాలశాఖామంత్రి ప్రహాద్ జోషి, అదేశాఖకు చెందిన సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. సమావేశానంతరం స్పీకర్ ఓం బిర్లా ఒక ట్వీట్ చేస్తూ, “అన్ని పార్టీల ఎంపీలు సభలు సజావుగా, శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. సభామర్యాద కాపాడేవిధంగా సభ్యులు క్రమశిక్షణ పాటిస్తూ సున్నితంగా సమావేశాలు పూర్తిచేసేందుకు సహకరించాలని కోరారు.
పార్లమెంటు అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్షాలు డుమ్మా
RELATED ARTICLES