HomeNewsBreaking Newsగొటబయ రాజీనామా

గొటబయ రాజీనామా

శ్రీలంకలో ఆగని హింస
84 మంది ఆసుపత్రిపాలు
కొలంబో :
దేశం వదిలిపారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స గురువారనాడు ఈ ద్వారా తన రాజీనామాను పంపించారు. స్పీకర్‌ అబేయ వర్దేన ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే అసాధారణమైన రీతిలో మాల్దీవుల దేశ పార్లమెంటు స్పీకర్‌ మహ్మద్‌ నషీద్‌ తొలుత శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజీనామా చేశారని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఆయన రాజీనామా చేశారు, ఇక శ్రీలంక దేశం ముందుకు సాగిపోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తు న్నా, ఆయన శ్రీలంకలో ఉండి ఉంటే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన భార్య చాలా భయభ్రాంతులకు గురయ్యారు, ఆయన భార్యకోసం రాజీనామా చేశారు, మాల్దీవుల ప్రభుత్వం చాలా ఆలోచనాత్మకంగా వ్యవహరించి చర్యలు తీసుకుంది, శ్రీలంక ప్రజలకు నా శుభాభినందనలు” అని మహ్మద్‌ నషీద్‌ ట్వీట్‌ చేశారు. ఈనెల 13న రాజీనామా చేస్తానని ఈనెల 9వ తేదీన రాజపక్స ప్రకటించారు. ఒకరోజు ఆలస్యంగా రాజీనామా చేశారు. 2019లో రాజపక్స ప్రజామోదంతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏరాటు చేశారు. ఈ వార్త తెలియగానే దేశంలో సంబురాలు మొదలయ్యాయి. జులై 13వ తేదీ తెల్లవారుజామున గొటబయ తన 13 మంది కుటుంబ సభ్యులతోకలిసి శ్రీలంక వైమానిక దళం సమకూర్చిన ప్రత్యేక జెట్‌ విమానంలో మాల్దీవులకు వెళ్ళిపోయారు. ఆ దేశ అధికార ప్రతినిధి ఆయనకు అక్కడ స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చారు. తరువాత ఆయన సింపూర్‌ వెళ్ళిపోయారు. సింగపూర్‌ నుండే గురువారంనాడు గొటబయ తన రాజీనామాను ఈ ద్వారా పంపించారు. దేశం వదిలివెళ్ళేముందు గొటబయ ప్రధానమంత్రి విక్రమసింఘేను తాత్కాలికప్రధానమంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే జులై 20న పార్లమెంటు సమావేశమై కొత్త అధ్యక్షుణ్ణి లాంఛనంగా ఎన్నుకుంటుంది. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు మరోవైపు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత విక్రమసింఘే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలకు ఇష్టమైన, ఆమోదయోగ్యమైన వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎంపికచేయాలని పార్లమెంటు స్పీకర్‌ అబేయవర్దేనకు సింఘే చెప్పారు. ఆయన మీడియా విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి, దేశాధ్యక్షుల భవనాలవద్ద ఆందోళనకారులు ఇప్పటికీ ఇంకా తిష్టవేసి ఉన్నారు. సైన్యం వారిని అడ్డుకునేప్రయత్నం చేయకపోవడంతో ఇంతటి భయంకరమైన సంక్షోభపరిస్థితుల్లో కూడా దేశంలో సైన్యం కాల్పులు,మృత్యువాత ఘటనలు జరగలేదు. అయితే శ్రీలంక తాత్కాలిక దేశాధ్యక్షుడుగా రనిల్‌ విక్రమసింఘే బుధవారంనాడు బాధ్యతలు స్వీకరించాక వెంటనే దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తాజాగా శ్రీలంక పశ్చిమ ప్రాంతానికి కూడా కర్ఫ్యూను పొడిగించారు. మరోవైపు గొటబయ పరారైనప్పటినుండీ ఆందోళనకారులు ప్రధానమంత్రి కార్యాలయం వద్ద ఘర్షణలకు దిగుతున్నారు. విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేస్తునారు. రెండోరోజు గురువారం కూడా భధ్రతా దళాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. నిరసన ప్రదర్శకులు బుధవార నుడీ ప్రధాని నివాసం వద్ద నిషిద్ధ ప్రదేశంలోకి చొరబడ్డారు. అక్కడే గార్డెన్‌లో తిష్టవేశారు. ఈ ఘర్షణల్లో 84 మంది ఆసుపత్రిపాలయ్యారు. గొటబయ పరారీ అనంతరం దేశంలో నిరసన ప్రదర్శనలు మరింతగా పెరిగాయి. రాజకీయసంక్షోభం శిఖరస్థాయికి చేరింది. పోలీసు ప్రతినిధి నిహాల్‌ థాల్‌దువా మాట్లాడుతూ, ప్రదర్శకులు టి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని, ఒక ఆర్మీ సోల్జర్‌ నుండి 60 బుల్లెట్లు కూడా చేజిక్కించుకున్నారని చెప్పారు. బుధవారంనాడు విధించిన కర్ఫ్యూను గురువారం ఉదయం ఉపసంహరించారు. తర్వాత మళ్ళీ కర్ఫ్యూ విధించారు.
కాగా సీకర్‌ అబేయవర్దనే తొలుత మాట్లాడుతూ, వీలైనంత త్వరగా రాజీనామా లేఖ పంపమని తాను గొటబయను కోరారని, అందుకు అనుగుణంగానే ఆయన గురువారంనాడు ఈ మెయిల్‌చేశారని చెప్పారు. నిర్ణీత ప్రకార గొటబయ 13వ తేదీన రాజీనామా చేయాలి. రాజీనామా అందినట్లు సీకర్‌ అబేయవర్దేన ధృవీకరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments