డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు
ప్రజాపక్షం/ ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణంలో వివక్ష ప్రదర్శించాయని అగ్గిపెట్టె వంటి ఇళ్లను నిర్మిస్తే పేదలు ఎలా జీవిస్తారని ప్రశ్నించిన ప్రభుత్వం… తెలంగాణలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. గోడ్డు, గోదా ఎక్కడ ఉండాలి, చుట్టపోడు వస్తే ఎక్కడుండాలి… అందుకే విశాలంగా రెండు గదుల ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అందుకు అనుగుణంగా నియోజక వర్గాల వారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారు. కొద్ది కాలం నిర్మాణాలు సాఫీగా నే సాగాయి. చాలా చోట్ల పంపిణీ కూడా చేశారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు. మరికొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఇళ్ల నిర్మాణాలు సాధ్యం కావడం లేదని, నిర్మాణాల నుంచి వైదొలిగారు. చాలా కాలంగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోవడంతో ప్రారంభమైన ఇళ్లలో జిల్లెల్లు, పుట్టలు, తుట్టలు పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంట్రాక్టర్ ప్రారంభించారు. పునాదులు వేసి ఫిల్లర్లు వేశారు. ఇప్పటికీ ఏడాది అయినా ఆ వైపు తిరిగి చూడకపోవడంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తయి గృహప్రవేశం చేస్తామని ఎంతో ఆనందంగా ఎదురు చూసిన గ్రామ పేదలకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇది ఒక్క చీమలపాడుకో మరో గ్రామానికో పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కనీసం ప్రారంభించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలనైనా పూర్తి చేయాలని పేదలు కోరుతున్నారు.
చోట్ల పంపిణీ కూడా చేశారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు. మరికొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఇళ్ల నిర్మాణాలు సాధ్యం కావడం లేదని, నిర్మాణాల నుంచి వైదొలిగారు. చాలా కాలంగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోవడంతో ప్రారంభమైన ఇళ్లలో జిల్లెల్లు, పుట్టలు, తుట్టలు పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంట్రాక్టర్ ప్రారంభించారు. పునాదులు వేసి ఫిల్లర్లు వేశారు. ఇప్పటికీ ఏడాది అయినా ఆ వైపు తిరిగి చూడకపోవడంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తయి గృహప్రవేశం చేస్తామని ఎంతో ఆనందంగా ఎదురు చూసిన గ్రామ పేదలకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇది ఒక్క చీమలపాడుకో మరో గ్రామానికో పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కనీసం ప్రారంభించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలనైనా పూర్తి చేయాలని పేదలు కోరుతున్నారు.
చిట్టడవి కాదు..
RELATED ARTICLES