ప్రజాపక్షం /వికారాబాద్ వికారాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ పెళ్లి బస్సు నీటిలో మునిగిన సంఘటన వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేట్ మండలం మొరంగపల్లి రైల్వే గేటు వద్ద చేటు చేసుకుంది. తాండూర్ ప్రధాన రోడ్డుమార్గం కావడంతో గత మూడు సంవత్సరాల క్రితం మొరంగపల్లి వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాకపోవడంతో వర్షాలు పడినప్పుడు ప్రజ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం తాండూర్ వైపు వెళుతున్న పెండ్లి బస్సు బ్రిడ్జి కిందకు వెళ్లగానే బురదలో ఇరుక్కుపోయి అగిపోయింది. దీంతో అందులో ఉన్నపెండ్లి వారు బస్సు దిగి నీటిలో తడుస్తూ వెళ్లారు. ఈ విషయం పై మోమిన్పేట్ పోలీసులు రైల్వే అధికారులకు సైతం సూచించి త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలు వాహనాలు నీటిలో చిక్కుకొని పాడయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడినప్పుడల్లా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వెంటనే సమస్య పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. నీటిలో ఉన్న బస్సును తీసేందకు సహయక చర్యలు చేపట్టారు బ్రిడ్జికింద ఉన్న నీటిని బయటకు మోటార్ల సహయంతో తోడేస్తున్నారు. ఈ బిడ్జి అధికారపార్టి నాయకుల పనులు చేపడుతున్నరనే సమాచారం అందుకే పనులు నాణ్యత పాటించడం లేదని స్థానికులు అరోపిస్తున్నార
వరద నీటిలో పెండ్లి బస్సు
RELATED ARTICLES