HomeNewsBreaking Newsఒక మ్యాచ్‌కి రూ. 100 కోట్లు

ఒక మ్యాచ్‌కి రూ. 100 కోట్లు

ఐపిఎల్‌ ప్రసార హక్కులకు భారీ డిమాండ్‌
వేలం విలువ రూ. 44 వేల కోట్లు
ముంబయి:
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉందని మరోసారి రుజువైంది. 2023 నుంచి 2027 వరకూ ఐపిఎల్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కుల కోసం నిర్వహించిన ఇ- విపరీతమైన డిమాండ్‌ కనిపించింది. జియో, స్టార్‌, సోనీ వంటి కంపెనీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఒక ఐపిఎల్‌ మ్యాచ్‌ని ప్రసారం చేసే హక్కులను అమ్మినందుకు భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి అక్షరాలా వంద కోట్ల రూపాయలు దక్కనున్నా యి. బిసిసిఐ సోమవారం నిర్వహించిన వేలం లో ప్రసార హక్కులను బిసిసిఐ 44,075 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. ప్రసార హక్కులను ప్యాకేజ్‌ ‘ఎ’, ప్యాకేజ్‌ ‘బి’గా బిసిసిఐ విభజించింది. ప్యాకేజ్‌ ‘ఎ’లో టీవీలో మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉంటాయి. ప్యాకేజ్‌ ‘బి’లో డిజిటల్‌ హక్కులను అమ్మకానికి పెట్టారు. కాగా, ప్యాకేజ్‌ ‘ఎ’ కింద టీవీలో మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులను సోనీ సంస్థ 23,575 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. భారత ఉపఖండం వరకూ ప్యాకేజ్‌ ‘బి’ కింద డిజిటల్‌ ప్రసార హక్కులను జియోకు అనుబంధంగా ఉన్న వయాకామ్‌18 సంస్థ రూ. 20,500 కోట్లకు దక్కించుకుందని సమాచారం. ఐదేళ్ల కాలానికి నిర్వహించిన ప్రసార హక్కుల అమ్మకం ద్వారా బిసిసిఐ ఒక మ్యాచ్‌కి రూ.107.5 కోట్లు వసూలు చేస్తున్నది. వాస్తవానికి ప్యాకేజ్‌ ‘ఎ’, ‘బి’లో హక్కుల అమ్మకాల కనీస విలువను బిసిసిఐ 33,340 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. కొంచం అటూఇటుగా అదే మొత్తం వస్తుందని భావించింది. కానీ, అంచనాలకు మించి ఇ కాసుల పంట కురిపించింది. 10,735 కోట్ల రూపాయలు అధికంగా లభించాయ

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments