HomeNewsBreaking Newsనిందితుల అరెస్టు

నిందితుల అరెస్టు

బేగంబజార్‌ పరువు హత్య కేసులో                                                                                                ప్రజాపక్షం/హైదరాబాద్‌  బేగంబజార్‌ మచ్ఛి బజార్‌ వద్ద జరిగిన నీరజ్‌ కుమార్‌ పన్వార్‌ (21) పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. రోహిత్‌, మహేష్‌, అభినందన్‌, విజయ్‌, సంజయ్‌తోపాటు ఓ మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు వెస్ట్‌జోన్‌ డిసిపి జోయల్‌ డేవిస్‌ తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేసులో పోలీసులు ఇప్పటి వరకూ జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైన అంశాలను వివరించారు. నీరజ్‌ను సంజన ప్రేమ వివాహం చేసుకున్నదని, వారికి రెండు నెలల వయసు ఉన్న బాబు ఉన్నాడని డేవిస్‌ తెలిపారు. సంజన కుటుంబీలకు ఈ వివాహం ఇష్టం లేదని, దీనితో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయని అన్నారు. కొన్నాళ్ల క్రితం రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారని అన్నారు. అయితే, నీరజ్‌ను హత్య చేయాలని సుమారు రెండు వారాలుగా ప్రయత్నిస్తున్న దుండగులు జుమెరాత్‌ బజార్‌ నుంచి మారణాయుధాలు కొనుగోలు చేశారని అన్నారు. నీరజ్‌ను ముందస్తు ప్రణాళిక ప్రకారం హత్య చేశారని వివరించారు. నీజర్‌కు తన సోదరులే హతమార్చారని, అంతకు ముందు పలు సందర్భాల్లో తమను బెదిరించారని సంజన చేసిన ఆరోపణలు నిజమని డిసిపి డేవిస్‌ ప్రకటనతో స్పష్టమైంది.
షాహినాథ్‌ గంజ్‌ పిఎస్‌ ఎదుట నిరసన
నీరజ్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అతని భార్య సంజన తన రెండు నెలల కుమారుడిని తీసుకొని, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది. తన సోదరులే నీజర్‌ను హత్య చేసినట్టు సంజన ఆరోపించింది. ఏడాదిగా తన సోదరులు బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తన సోదరులు వెనక్కి తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నీజర్‌ను హత్య చేసిన వారిని ఉరితీయాలన్న నినాదాలతో షాహినాథ్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు దద్దరిల్లాయి. గంట పటు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితులను. తమ ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు. చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో, చివరికి ఆందోళన విరమించారు. కాగా, తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య నీరజ్‌ మృత దేహానికి పోస్ట్‌మార్టం పూర్తియింది. అనంతరం మృతదేహాన్ని మంధువులకు అప్పగించారు.                  మా ప్రమేయం లేదు..
సంజన తల్లి మధు బాయి
నీరజ్‌ హత్యలో తమ కుటుంబ ప్రమేయం ఏమీ లేదని సంజన తల్లి మధు బాయి చెప్పింది. నీరజ్‌ హత్యకు గురయ్యాడన్న వార్త తెలిసిన వెంటనే తన కుమారుడు భయపడి పారిపోయాడే తప్ప, వారికి ఇందులో అతనికి ఎలాంటి పాత్ర లేదని ఆమె విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది. నీరజ్‌ హంతకులను ఉరితీయాలని కూడా ఆమె డిమాండ్‌ చేసింది. అతనిని ఎవరు చంపారో తమకు తెలిదని పేర్కొంది. సంజన దంపతులు సుఖంగా ఉంటే చాలనుకున్నామని చెప్పింది. అయితే కొన్ని రోజులుగా అల్లుడు నీరజ్‌ను చంపుతామని కొందరు బెదిరిస్తూ వచ్చారని, వారెవరో మాత్రం తమకు తెలియదని అన్నది. తన కుమార్తె సంసారాన్ని నాశనం చేశారని వాపోయింది. సంజన సోదరి మమత మాట్లాడుతూ, ఈ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని అన్నది. ప్రేమ వివాహం ఇష్టంలేకే ఏడాది పాటు సంజనతో మా ట్లాడకుండా దూరంగా పెట్టామని ఆమె పేర్కొంది. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సంజనతో రెండుమూడు రోజులుగా మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. సంజన సంతోషంగా ఉంటే చాలని అనుకున్నామని తెలిపింది. ఇలాంటి ఘటనను తాము ఊహించలేదని అన్నది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments