HomeNewsBreaking Newsఓ సంచలనం జరుగుతుంది

ఓ సంచలనం జరుగుతుంది

ఏమవుతుందో అందరూ చూస్తారు : కెసిఆర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉన్నదని, అది జరిగి తీరుతుందని, భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కెసిఆర్‌ దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను శనివారం సాయంత్రం సందర్శించారు. కెసిఆర్‌ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంటరీని కేజ్రీవాల్‌తో కలిసి సిఎం కెసిఆర్‌ వీక్షించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు వివరించారు. పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని కెసిఆర్‌ కొనియాడారు. అనంతరం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కెసిఆర్‌ మహమ్మద్‌పూర్‌ మొహల్లా క్లినిక్‌ను కూడా సందర్శించారు. అంతకుముందు కెసిఆర్‌ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. కేజ్రీవాల్‌ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారని, విద్యార్థులను జాబ్‌ సీకర్లుగా కాకుండా జాబ్‌ ప్రొవైడర్లుగా మార్చుతున్నారన్నారు. ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇందుకు తెలంగాణ ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపిస్తామని, ఢిల్లీ బోధనా విధానాలను అధ్యయం చేయాలని చెప్పామన్నారు. ఢిల్లీ బోధనా విధానాలు దేశానికి మొత్తం ఆదర్శనీయమన్నారు. రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతామన్నారు.
అఖిలేష్‌ యాదవ్‌తో భేటీ
సమాజ్‌వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్‌ (యుపి) మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ శనివారం తెలంగాణ సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు. వీరివరు పలు జాతీయ అంశాలపై చర్చించినట్టు సమాచారం. అదే విధంగా దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండాకు రూపకల్పన చేసే అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇటీవ ముగిసిన యుపి అసెంబ్లీ ఎన్నికలు, వర్తమాన దేశ రాజకీయ పరిస్థితులపై కూడా వీరు చర్చించారని అంటున్నారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని
కెసిఆర్‌ నివానికి అఖిలేష్‌ చేరుకున్నారు. ఆయనకు కెసిఆర్‌తోపాటు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపిలు సంతోష్‌ కుమార్‌, నామా నాగేశ్వర్‌రావు తదితరులు గనంగా స్వాగతం పలికారు. ఇలావుంటే దేశ రాజకీయాలపై కెసిఆర్‌ దృష్టి పెట్టారని, బిజెపి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఒకేతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని సమాచారం. అందులో భాగంగానే ఆయన శనివారం అఖిలేష్‌తో పలు అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. రాజకీయనాయకులతోపాటు కెసిఆర్‌ ఈ పర్యటనలో నాగంగా పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా కలుస్తారని అనధికార ర్గాల ద్వారా తెల్తున్నది. ఆయన కాంగ్రెస్‌ను కూడా విశ్వసించడం లేదని, బిజెపి, కాంగ్రేతర పార్టీలను ఏకం చేయడమే ధ్యేయంగా వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. ఈక్రంలోనే ఆయన పలువురు ప్రముఖ నేతలను కలుస్తారు. ఈ నెల 22న పంజాబ్‌లో కెసిఆర్‌ పర్యటిస్తారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. 600 రైతు కుటుంబాలకు తలా మూడు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. 26న ఆయన బెంగళూరు వెళ్లి, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అవుతారు. దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కూడా ఆయన కలుస్తారు. అక్కడి నుండి షీర్డీ సాయిబాబా దర్శనం కోసం వెళ్తారు. షీర్డీ నుండి కేసీఆర్‌ హైద్రాబాద్‌ కు తిరిగి వస్తారు. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో కెసిఆర్‌ బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉంది. గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను కూడా ఆయన పరామర్శించనున్నట్టు సమాచారం. మొత్తం మీద కెసిఆర్‌ పర్యటన ఎంత వరకూ లాభిస్తుందేనేది తేలాల్సి ఉంది.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments