HomeNewsBreaking Newsసర్కారీ ఇంజనీరింగ్‌ కాలేజీ కరీంనగర్‌కు ఏది?

సర్కారీ ఇంజనీరింగ్‌ కాలేజీ కరీంనగర్‌కు ఏది?

పాత ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు జెఎన్‌టియు కాలేజీలు
జిల్లాల పునర్విభజన తర్వాత కరీంనగర్‌కు ఇంజనీరింగ్‌ కాలేజీనే లేదు..
యూనివర్సిటీకి అనుబంధంగా కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థుల డిమాండ్‌
ప్రజాపక్షం / కరీంనగర్‌ కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం కరీంనగర్‌ జిల్లాకు ‘ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ’ లేకుం డా పోయింది. ఉమ్మడి ఎపిలో కాంగ్రెస్‌ ప్రభు త్వ హాయాంలో కరీంనగర్‌ జిల్లాకు జెఎన్‌టియు కాలేజీ మంజూరు కాగా అప్పటి మంత్రి జీవన్‌రెడ్డి దాన్ని తన నియోకవర్గం జగిత్యాల సమీపంలో ఏర్పాటు చేయించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వంలో మరో కాలేజీ మంజూరు చేస్తే దాన్ని అప్పటి మంత్రి డి.శ్రీధర్‌ బాబు మంథని సమీపంలో ఏర్పాటు చేయించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాలను పునర్వ్యవస్థీకరించడంతో ఉమ్మడి కరీంనగర్‌ నాలుగు జిల్లాలుగా మారింది. ఒక కళాశాల జగిత్యాలకు, రెండవది పెద్దపల్లి జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. కొంతకాలం కింద కెసిఆర్‌ ప్రభుత్వం మరో జెఎన్‌టియు కాలేజీ ఇస్తే దానినని మంత్రి కెటిఆర్‌ తాను ప్రాతినిథ్యం వహిససురాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేయించుకున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న కరీంనగర్‌కే సర్కారు ఇంజనీరింగ్‌ కాలేజీ లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులు పొరుగు జిల్లాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి ఎపిలో కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కరీంనగర్‌లో శాతవాహన పిజి సెంటర్‌ ఏర్పాటు చేశారు. కొత్త వర్సిటీల ఏర్పాటుతో శాతవాహన పిజి సెంటర్‌ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. అదే సమయంలో కరీంనగర్‌ జిల్లాకు జెఎన్‌టియు కాలేజీ మంజూరు చేస్తే విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతమనే కారణంతోనే జగిత్యాల సమీపంలో ఏర్పాటు చేశారు. రెండో కాలేజీని అలాగే మంథనికి తీసుకుపోయారు. కరీంనగర్‌లో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా వర్సిటీలో ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాపించాలని విద్యార్థి సంఘాల నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. జిల్లాల విభజనతో ఇంజనీరింగ్‌ కాలేజీ లేకుండా పోయిన కరీంనగర్‌ జిల్లాపై ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని, జెఎన్‌టియు కాలేజీ ఏర్పాటు చేయాలని, లేదా శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేసేవరకు ఉద్యమం
ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి
కరీంనగర్‌ జిల్లాలో ఆరు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. కొన్ని ప్రైవేటు కళాశాలల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులకు అదనపు సెక్షన్లకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ విద్యార్థులను ఆర్థిక దోపిడీ చేయడానికి సహకరిస్తోంది తప్ప ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల లేకపోవడం వల్ల ఫీజులు కట్టలేని ప్రతిభ కలిగిన పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్‌ విద్య చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వం వెంటనే కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, లేనట్లయితే కళాశాల ఏర్పాటు చేసేవరకు ఉద్యమం చేపడుతాం.
ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలి
తెలంగాణలో అతిపెద్ద మూడో నగరమైన కరీంనగర్‌లో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల తక్షణమే ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. ఫలితంగా స్థానిక విద్యార్థులు ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజుల దోపిడి నుండి విముక్తి పొందుతారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments