అధ్యక్షుడు పుతిన్ ప్రకటన
‘నాటో’లో చేరే ఆలోచన మానుకోవాలని స్వీడన్, ఫిన్లాండ్‌కు హెచ్చరిక
మాస్కో: ఉక్రేన్‌లోని ప్రధాన నగరమైన మరియుపోల్ తమ హస్తగతమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రక్షణ మంత్రి సెర్గీ షోయితో సమావేశమైనప్పుడు ఆయన మాట్లాడుతూ మరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతమైందన్నారు. దీనిని సాకారం చేసిన సైన్యాన్ని ఆయన అభినందించారు. ఫిబ్రవరి 24న ఉక్రేన్‌పై దాడులు మొదలుపెట్టిన రష్యాకు ఇది కీలక విజయంగా పేర్కోవాలి. ఇది వరకే ప్రజాభీష్టం మేరకు రష్యాలో కలిసిన క్రిమియాకు, ఇటీవలే రష్యా స్వతంత్ర ప్రాంతంగా గురిచిన డాన్ బాస్‌కు మధ్య ఉన్న మరియుపోల్ వశంకావడంతో, రష్యా తన కీలక లక్ష్యాన్ని చేరుకుంది. ఇలావుంటే, నాటో కూటమిలో చేరే ఆలోచనలు ఏవైనా ఉంటే, వాటిని మానుకోవాలని స్వీడన్,
ఫిన్లాండ్ దేశాలకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. నాటోలో చేరడం సరికాదని హితవుపలికింది. ఒకవేళ తమ మాటలను బేఖాతరు చేస్తూ, నాటోలో చేరడానికి ప్రయత్నిస్తే, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని స్పష్టం చేసింది. నాటోలో చేరేందుకు స్వీడన్, ఫిన్లాండ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రష్యా చేసిన హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, కీవ్, లివివ్, ఖర్కీవ్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. త్వరలోనే మరికొన్ని కీలక నగరాలు రష్యా ఆధీనంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరియుపోల్ రష్యా వశం
RELATED ARTICLES