ప్రాజెక్ట్ ఇదే చివరి సబ్ మెరైన్
ముంబయి : యుద్ధ పోరాటాలకు ఉద్దేశించిన అతిశక్తిమంతమైన జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ వగ్షీర్’ బుధవారంనాడు జల ప్రవేశం చేసింది. ప్రాజెక్టు భాగంగా ముంబయిలోని మెజగాన్ డాక్ షిప్పింగ్ బిల్డర్స్ నిర్మించిన ఆరు జలాంతర్గాములలో ఐఎన్ఎస్ వగ్షీర్ చివరి జలాంతర్గామి. ఈ జలాంతర్గామి జలప్రవేశ కార్యక్రమాన్ని రక్షణశాఖా కార్యదర్శి అజయ్ కుమార్ నిర్వహించారు. ఈ జలాంతర్గామి జల ప్రవేశం చేయడానికి ముందుగా అన్ని రకాలుగా సబ్‌మెరైన్‌ను కఠిన పరీక్షలకు గురిచేశామని, ఏడాదికాలంపైగా నిర్వహించిన ఈ కఠిన పరీక్షలలో జలాంతర్గామి అన్నింటినీ తట్టుకుని నిలబడి పోరాటాలకు సిద్ధపడి విజయవంతంగా జలప్రవేశం చేయడానికి అర్హతలు సంపాదించుకుందని కుమార్ చెప్పారు. ఈ జలాంతర్గామి పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించామని, భారత్ స్వావలంబనకు ఈ జలాంతర్గామి ఒక చిహ్నమని అన్నారు. రూ.43 వేల కోట్ల ఖర్చుతో ఈ ఆరు జలాంతర్గాములను నిర్మించారు. ఇవన్నీ సముద్రతీరానికి కూడా మద్దతు ఇస్తాయి, ఇంజరింగ్,శిక్షణల నిమిత్తం కూడా సమకాలీన ఆయుధాలు,సెన్సర్లతోఅత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో దేశీయ అవసరాలకు అనుగుణంగా యుద్ధ పటిమతో ఇవి పనిచేస్తాయి. ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరాంగ్, ఐఎన్ఎస్ వేలా జలాంతర్గాములు ఇప్పటికే సముద్ర జలాలలను అలవాటు చేసుకుంటూ శిక్షణ పొందుతున్నాయి. ఈ జలాంతర్గాములు ఏడాదికాలంపాటు తమ శక్తిసామర్థ్యాలను రుజువు చేసుకునే ప్రక్రియలో మునిగి ఉంటాయని, ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ట్రయల్స్ పూర్తయ్యాక బహుశా ఈ ఏడాది చివరిలోనే పూర్తిస్థాయిలో జలప్రవేశం చేసి భారత నౌకాదళంలోకి చేరుకుంటాయని అజయ్ కుమార్ చెప్పారు. ఫ్రెంచ్ సాంకేతికత సహాయంతో ఈ జలాంతర్గాముల ప్రాజెక్టు కొనసాగింది.
నిజం చెప్పాలంటే, ఐఎన్ఎన్ఎస్ వగ్షీర్కు ఏడాదికాలంపాలు కఠోరమైన పరీక్షలు నిర్వహించామని, ఈ సమగ్ర పరీక్షల్లో జలాంతర్గామి తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుందని అజయ్ కుమార్ చెప్పారు. భారత సముద్ర జలాల సరిహద్దుల మాత్రమే కాకుండా, భారత స్వావలంబనకు ఈ జలాంతర్గామి గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. శాండ్ ఫిష్‌కు చిహ్నంగా ఈ జలాంతర్గామికి ఈ పేరు పెట్టారు. శాండ్ ఫిష్ ఊహించనంత సముద్రలోతుల్లో విహరిస్తుంది. భారతదేశ మొట్టమొదటి జలాంతర్గామిని 1974లో జలప్రవేశం చేయించగా అది 1997లో తన విధుల నుండి వైదొలగింది. దానిస్థానంలో కొత్త తరం జలాంతర్గాములు వచ్చాయి. ఒక జలాంతర్గామి తన విధుల నుండి వైదొలగితే అదే పేరుతో మరో ఆత్యాధునిక జలాంతర్గామి ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. సముద్ర అంతర్గత జలాల ధోరణిని సమగ్రంగాఅర్థం చేసుకుని శత్రువును తుత్తునియలు చేసేవిధంగా భారీఎత్తున ఈ కొత్త జలాంతర్గామి తన దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ జలప్రవేశం సందర్భంగా జరిగిన సభలో భారత పశ్చిమ నౌకాదళం కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్,వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకూ నాలుగు జలాంతర్గాములను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇవన్నీ అత్యంత ఆధునిక పోరాట పటిమతో తయారయ్యాయన్నారు. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలకు ఇవన్నీ చిహ్నమన్నారు.
అతి శక్తిమంతమైన యుద్ధ జలాంతర్గామి ఐఎన్ఎస్ వగ్షీర్ జలప్రవేశం
RELATED ARTICLES