మృతుల్లో ఐదుగురు చిన్నారులు సహా దంపతులు
పంజాబ్‌లోని లూధియానాలో ఘోర అగ్నిమ్రాదం
లూధియానా : పంజాబ్‌లోని లుథియానాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బీహార్ నుంచి వలస వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో దంపతులు సహా ఐదుగురు చిన్నారులు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టిబ్బా రోడ్డులోని మున్సిపల్ గార్బేజీ డంపు సమీపంలో ఉన్న గుడిసెలో వీరు నిద్రిస్తుండగా మంటలు చెలరేగినట్లు అసిస్టెంట్ కమిషనర్ సురేందర్‌సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో భార్యభర్తలతోపాటు వారి నలుగురు కుమార్తెలు, ఏడాది వయసున్న కుమారుడు చనిపోయినట్లు టిబ్బా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ రణబీర్ సింగ్ గురి ధ్రువీకరించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, వేరే ప్రాంతంలో నిద్రిస్తున్న వీరి మరో కుమారుడు రాజేశ్ ఒక్కడే ప్రాణాలతో మిగిలారన్నారు. సమాచారమందుకున్న వెంటనే సుందర్ నగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారని.. అయితే, అప్పటికే వీరంతా మరణించారని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
కుటుంబం సజీవ దహనం
RELATED ARTICLES