HomeNewsBreaking Newsవిద్యుత్‌లో అంతరాయం... నెర్రెలు వారిన పొలాలు

విద్యుత్‌లో అంతరాయం… నెర్రెలు వారిన పొలాలు

7 గంటలు కూడా ఉండని విద్యుత్‌ సరఫరా
కాలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
ఆందోళనలో రైతులు
ప్రజాపక్షం/మద్దూరు/ధూల్మిట్ట పంట చేతికందే సమయంలో వేసిన పంట పొలాలు నెర్రలు వారి ఎండిపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడినా పెట్టిన పెట్టుబడి రాని స్థితిలో ఎండిన పంటలను చూసి అన్నదాతలు కడుపు మంటతో ఎండిన పంటను గొర్లు, మేకలకు మేతగా వేస్తున్నారు. ఇక వైపు మం డుతున్న ఎండలు, మరోవైపు అరకొరగా విద్యుత్‌ సరఫరాతో తగిన నీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “స్వరాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉండవన్నారు. లోవోల్టేజీ, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, గంటల తరబడి కోతలకు గుడ్‌బై అన్నారు. చీకట్లు మాయం.. నిరంతర వెలుగులు.. విద్యుత్‌ భరోసా” అని సిఎం కెసిఆర్‌ సహా నేతలంతా ప్రకటించినా ఆచరణలో పరిస్థితి దానికి పూర్తి విరుద్దంగా ఉంది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా ఒక కలగా మిగిలింది. ప్రస్తుతం 11 గంటలు సరఫరా చేస్తామని ఒక సారి, 7 గంటలు ఇస్తామని మరోసారి విద్యుత్‌ శాఖ అధికారులు ప్రకటనటు చేసినా.. ఈ కొన్ని గంటలు కూడా సరిగ్గా విద్యుత్‌ సరఫరా కావడం లేదని సిద్దిపసేట జిల్లాలోని అనేక ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ఉమ్మడి మద్దూరు మండలంలోని గాగిళ్లపూర్‌ గ్రామంలో ఓ రైతు వేసి పంటపొలం చెతికందే సమయంలో నీరు అందక గొర్లు మేకలకు మేతగా వేశారు. గతంలో జాలపల్లి గ్రామంలో పలువురు రైతుల ఆరుగాలం కష్టంచి సాగు చేసిన పంటలకు వేసవిలో భూగర్బజలాల సమస్యతో నీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయని, కళ్ల ముందే నెర్రెలు బారుతుంటే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ పంటను పశువులకు మేతగా వేస్తూ నిరసన తెలిపారు. పంట పోలాలకు నీరందించేందుకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు విజ్ఞఫ్తులు చేసినా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని రైతులు పాలకవర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూల్మిట్ట మండలం బెక్కల్‌ సబ్‌స్టెషన్‌ కింద ఆ గ్రామంతో పాటుగా కూటిగల్‌, చేర్యాల సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయంతో రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నట్లు పదేపదే విద్యుత్‌ అధికారులకు తెలిపినా లాభంలేకుండా పోయిందని ఆక్రోషం వెలిబుచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments