HomeNewsBreaking Newsమోడీ ప్రభుత్వం లక్ష్యం.... రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడమే!

మోడీ ప్రభుత్వం లక్ష్యం…. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడమే!

ప్రజాపక్షం / హైదరాబాద్‌ దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంతోపాటు న్యాయవ్యవస్థ, విద్యావ్యవస్థ, మీడియాతో సహా అన్ని ప్రజాస్వామ్య సంస్థలను రాజ్యాంగ వ్యతిరేక శక్తులు క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. అంబేద్కర్‌ మనకు అందించిన భారత రాజ్యాంగ పునాదులను దెబ్బతీస్తూ మనుస్మృతిని భర్తీ చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కుట్రలు పన్నుతున్నాయని, అందుకే ముందుగా ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని అయన తెలిపారు. బిజెపి మతతత్వ, తిరోగమన విధానాల వల్ల రాజ్యాంగం ద్వారా అంబేద్కర్‌ దళిత బహుజనులకు కల్పించిన ఆర్థిక, సామాజిక హక్కులకు రక్షణ లేకుండా పోతుందని, దళితులను పేదరికం, వివక్షలోకి నెట్టే ప్రమాదం ఉందని అయన ఆందోనళ వ్యక్తం చేశారు. భారత రత్న డాక్టర్‌ భీం రావు అంబేద్కర్‌ 131 వ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌ లిబర్టీ నుండి సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ట్యాంక్‌ బండ్‌ వద్దనున్న అంబేద్కర్‌ విగ్రహం వరకు “రాజ్యాంగ పరిరక్షణ” ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం చాడ వెంకట్‌ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి సయ్యిద్‌ అజీజ్‌ పాషా, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ, సిపిఐ రాష్ర్ట సమితి సభ్యులు ప్రేమ్‌ పావని, ఎస్‌. ఛాయాదేవి తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దళితులు స్వావలంబన పొంది, రాజకీయ అధికారం కోసం పోరాడితే తప్ప వారి హక్కులు వారికీ దక్కవన్నారు. భారత రాజ్యాంగ గణతంత్ర స్వరూపాన్ని మార్చేందుకు నిరంతరం రాజ్యాంగవ్యతరేక శక్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, భారత ప్రజలమైన మనం ఒక్కటిగా ఎదగి, అది మన రాజ్యాంగమని గ్రహించి, మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలమని ప్రతిజ్ఞ చేయాలనీ అలాగే రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఉద్యమాలను తీవ్రతరం చేయాలని చాడ వెంకట్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అజీజ్‌ పాషా మాట్లాడుతూ భారతదేశమంతటా దళితుల గౌరవం, దళిత హక్కుల పరిరక్షణ, దళితుల స్థితిగతుల మెరుగుదల కోసం అనేక పోరాటాలు చేసి అంబేద్కర్‌ అత్యంత ఉన్నతమైన వ్యక్తి ఎదిగారని, ప్రజాస్వామ్య, లౌకిక, సమాఖ్య సిద్ధాంతాల యొక్క ప్రధాన రూపశిల్పి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె. కాంతయ్య, ఎఐవైఎఫ్‌ రాష్ర్ట అధ్యక్షులు వలి ఉల్లాహ్‌ ఖాద్రి, హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్లేకంటి శ్రీకాంత్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ నాయకులూ బి.స్టాలిన్‌, నగర ప్రధాన కార్యదర్శి గ్యార నరేష్‌, దళిత హక్కుల పోరాట సమితి హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరుపోతుల కుమార్‌, సిపిఐ నగర నేతలు పడాల నళిని, జ్యోతి శ్రీమాన్‌, ఒమర్‌ ఖాన్‌, లతీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments