న్యూఢిల్లీ : తక్షణమే ఖార్కివ్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఉక్రేన్‌లోని భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. రష్యా దళాలు ఖార్కివ్‌ను ఆక్రమించినట్టు వార్తలు అందుతుండగా, అక్కడ భీకర వాతావరణం నెలకొందని సమాచారం. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. ఆ ప్రాంతం నుంచి పెసోచిన్, బబయె, బెజ్లిడోవ్కా తదితర ప్రాం తాలకు వెంటనే పయనం కావాలని ఆదేశించింది. భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఖర్కివ్‌లోని భారతీయులంతా ఉక్రేన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఆరు గంటల్లోగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఎంబసీ తన ప్రకటనలో తెలిపింది. ఇలావుంటే, ‘ఆపరేషన్ గంగ’లో భారంగా ఉక్రేన్ నుంచి భారత పౌరులను తరలించే కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. బుధవారం వచ్చిన వారిలో 23 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి తమతమ స్వస్థలాలకు చేరుకోనున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అంతకు ముందు, సోమవారం 249 మంది బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన 11మంది ఉన్నారు.
తక్షణమే… ఖార్కివ్ వీడండి
RELATED ARTICLES