HomeNewsBreaking Newsస్వదేశానికి చేరిన మరో 688 మంది భారతీయులు

స్వదేశానికి చేరిన మరో 688 మంది భారతీయులు

స్వాగతం పలికిన మంత్రి సింధియా
ఇంకా 13 వేలమంది మిగిలిపోయారు !
ట్రిప్పుకు రూ.1.10 కోట్లు ఎయిర్‌ ఇండియా ఖర్చు

న్యూఢిల్లీ : యుద్ధంలో చిక్కుకున్న ఉక్రేన్‌ దేశం నుండి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియలో భాగంగా ఆదివారం ఉదయం ఎయిర్‌ ఇండియా 688 మంది భారతీయులను న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేర్చింది. మొత్తం మూడు విమానాల్లో 688 మంది భాతీయులు ఉక్రేన్‌ నుండి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. దీంతో శనివారం, అదివారం రెండు రోజుల్లో 907 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లయింది. శనివారం రాత్రి ఎయిర్‌ ఇండియాలో 219 మంది భారతీయులు ముంబయి చేరుకున్నారు. వారిలో 15 మంది విద్యార్థులు తెలుగు రాష్టాలవారు ఉన్నారు. వారంతా తరువాత ముంబయి నుండి హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని స్వంత ఊళ్ళకు వెళ్ళారు. కాగా టాటాగ్రూప్‌నకుచెందిన మరో క్యారియర్‌ ఫ్లుటై ద్వారా బుఖారెస్ట్‌ నుండి 198 మందితో ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు ఢిల్లీ బయలుదేరింది. ‘ఆపరేషన్‌ గంగ’ పేరిట వీరిని తరలిస్తున్నారు. భారత పౌర విమానయానశాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానాశ్రయంలో భారతీయులకు స్వాగతం పలికారు. ఇంకా 13 వేలమంది భారతీయులు ఉక్రేన్‌లో ఉన్నారని, వారందనిరీ సురక్షితంగా తీసుకువస్తామనని ఆయన భారత్‌కు వచ్చిన విద్యార్థులతో మాట్లాడుతూ చెప్పారు. ప్రతి భారతీయ విద్యార్థితో తాము అనుసంధానం కలిగి ఉన్నామన్నారు. మీరంతా చాలా కష్టకాలాని ఎదుర్కొంటున్నారు, నాకకు తెలుసు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, 130 కోట్లమంది భారతీయులు మీకు మద్దతుగా ఉన్నారు అని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ప్రతి భారతీయుణ్ణీ స్వదేశానికి తరలించేందుకు వీలుగా ప్రధాని నరేంద్రమోడీ ఉక్రేన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయంలో రష్యా ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపామని చెప్పారు. శనివారంనాడు మొదటి విమానంలో 219 మంది భారత్‌కు చేరుకోగా, ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు మరో 250 మంది ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 9.20 గంటలకు మూడో విమానంలో మరో 240 మంది ఢిల్లీ వచ్చారు.
ఉక్రేన్‌ గగనతలంలోకి విమానాలు ప్రవేశించే అవకాశం లేకపోవడంతో ఉక్రేన్‌ సరిహద్దుల్లో ఉన్న రుమేనియా, హంగేరి దేశాలలోని బుడాపెస్ట్‌, బుఖారెస్ట్‌ నగరాలకు ఉక్రేన్‌లోని భారతీయులను రప్పించి అక్కడి నుండి ఎయిర్‌ ఇండియా ద్వారా వారిని భారత్‌కు తరలిస్తున్నారు. ఎయిర్‌ ఇండియా ద్వారా భారతీయులను తరలించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఉక్రేన్‌ సరిహద్దుల్లో ఉన్న రుమేనియా దేశానికి భారతీయులను భూ మార్గంలో రప్పించి అక్కడి నుండి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాలో స్వదేశానికి భారత్‌ తరలిస్తున్నారు. ఇందుకోసం భారత ప్రభుత్వం ప్రత్యేకించి ఎయిర్‌ ఇండియా విమానాలను అద్దెకు తీసుకుంది. రుమేనియా రాజధాని నగరం బుఖారెస్ట్‌ విమానాశ్రయం నుండి హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ విమానాశ్రయం నుండి భారత్‌ ఎయిర్‌ ఇండియా విమానాలు ఉక్రేన్‌లోని భారతీయులను తీసుకుని వస్తున్నాయని అధికారులు చెప్పారు. డ్రీన్‌ లైనర్‌గా పిలిచే అతి పెద్దవైన బోయింగ్‌ 787 విమానాల ద్వారా భారతీయులను తరలిస్తున్నారు. ఈ విమానాలకు ప్రయాణ ఖర్చు గంటకు సుమారు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారు. ఈ లెక్కన రానూపోనూ ప్రయాణ దూరాన్ని బట్టి ఒక ట్రిప్పుకు రూ. 1.10 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో సిబ్బందికి, నావిగేషన్‌కు, ల్యాండింగ్‌కు, ఇంధనం, పార్కింగ్‌ ఖర్చులూ అన్నీ కలిసి ఉంటాయి.
భారత్‌ జెండా పెట్టుకు రావాలి
ఉక్రేన్‌ నుండి రుమేనియా, హంగేరీ సరిహద్దులకు భూ మార్గం ద్వారా ప్రయాణించే భారతీయులు తమ తమ పాస్‌పోర్టుల జెరాక్సులు ఉంచుకోవాలని, సైన్యం ప్రశ్నిస్తే వారికి ఇవ్వడాకి ఇవి అవసరమని, భారతీయులు తాము ప్రయాణించే వాహనాలపై భారతీయ జెండా పెట్టుకుని సరిహద్దుల వరకూ ప్రయాణం చేయాలని భారత విదేశాగశాఖ, రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేశాయి. కీవ్‌ నుండి రుమేనియా సరిహద్దు ప్రాంతానికి భూ మార్గంలో 600 కి మీ దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణ సమయం సుమారు 11 గంటలపాటు కొనసాగుతుంది. ఈ ప్రయాణమార్గంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భారతీయ చిహ్నాలు ప్రదర్శించాలని కోరింది.కాగా కీవ్‌ నుండి హంగేరీ సరిహద్దుకు 820 కి.మీ దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. రోడ్డు మార్గంలో సుమారు 13 గంటలు ప్రయాణం చేయాలి. ఉక్రేన్‌లో ఉన్న భారతీయులు ఉక్రేన్‌ రుమేనియా సరిహద్దులక, ఉక్రేన్‌ సరిహద్దులకు రహదారి మార్గాలలో చేరుకున్నారు. వారిని అక్కడి నుండి భారతీయ అధికారులు బుఖారెస్ట్‌కు, బుడాపెస్ట్‌కు తరలించి ఈ రెండు విమానాశ్రయాలలో ఉన్న భారత్‌ ఎయిర్‌ ఇండియా విమానాలను ఎక్కించి సురక్షితంగా తరలించే ఏర్పాటు చేస్తున్నారు. భారతీయుల తరలింపు చర్యలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని విదేశాంగమంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. భారతీయుల రక్షణ,భద్రతే భారత్‌ ప్రధాన ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీన ఉక్రేన్‌ గగనతలాన్ని మూసివేయడంతో భారతీయులను తీసుకువచ్చేందుకు వెళ్ళిన విమానం మార్గమధ్యంలోంచే వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత ప్రతిపక్షాల నుండి తల్లిదండ్రుల నుండి తీవ్రమైన ఒత్తిడి ప్రభుత్వంమీద పెరిగిపోవడంతో విదేశాంగమంత్రిత్వశాఖ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి చకచకా పావులు కదిపి ఎయిర్‌ ఇండియా విమానాలను రుమేనియా, హంగేరీ దేశాలకు పంపించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments