ఈనెల 17న విభజన అంశాలపై కేంద్ర కమిటీ సమావేశం
ఐదు అంశాలతో ఎజెండా రూపకల్పన
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ,ఎపి రాష్ట్రాల విభజన సమస్యలపై ఈనెల 17న కేంద్ర హోం శాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శికె.రామకృష్ణారావు, ఎపి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో కేవలం 5 అంశాలను మాత్రమే అజెండా తయారు చేశారు. ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పన్నుల విషయంలో లోటుపాట్లు, నగదు నిల్వ, బ్యాంకు డిపాజిట్లు, రెండు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖల్లో నగదు క్రెడిట్ జమ అంశాలపై చర్చ జరగనుంది. కాగా అజెండాలో తొలుత ఎపి ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపర్చారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని తొలగిస్తూ కేంద్ర హోంశాఖ అజెండాలో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్తగా మరో అజెండాతో సర్కులర్ను జారీ చేసింది
చర్చిద్దాం రండి
RELATED ARTICLES