నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి
ప్రజాపక్షం/ఖానాపూర్ ప్రైవేటు వాహనం (ఆటో) డ్రైవర్ నిర్లక్ష్యం ఖరీదు మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కడెం మండలం పెద్దబెల్లాల్ చెరువులో ఆటో బోళ్తాపడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కడెం మండలం ఆయా గ్రామాల నుండి జగిత్యాల జిల్లా బోర్నపల్లి గ్రామానికి ఆటోలో బయలుదేరిన ఆరుగురు ప్రయా ణీకుల్లో ముగ్గురు ప్రయాణీకులు చెరువులో పడి విగత జీవులుగా మారడం పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. కడెం ఎస్సై రాజు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండల కేంద్రం నుండి బోర్నపల్లికి ఆరుగురు ప్రయాణీకులతో బయలుదేరిన ఆటో కొంత సమయంలోనే పెద్ద బెల్లాల్ గ్రామ సమీపంలో కల్వర్ట్ను ఢీకొని చెరువులో పడిపోయింది. ఆటోలో ప్రయాణీస్తున్న చిన్నక్యాంపు మల్లన్నపేట, పెద్ద బెల్లాల్ గ్రామాలకు చెందిన బోడ మల్లయ్య, చీమల శాంత, శంకరవ్వ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి (60) ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై పేర్కొన్నారు.
అతివేగం ప్రాణం తీసింది
RELATED ARTICLES