ఒకరు మృతి.. మరొకరి కోసం గాలింపు
రామానుజవరంలో విషాదం
ప్రజాపక్షం/ మణుగూరు: గోదావరిలో పడి ఇద్దరు గల్లంతైన సంఘటన మండల పరిధిలోని రామానుజవరం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే … పదో తరగతి కలిసి చదువుకున్న నలుగురు యువకులు సరదాగా గోదావరి వద్దకు వెళ్లారు. అక్కడ స్నేహితులంతా ఫొటోలు దిగుతున్న క్రమంలో ప్రమాద వశాత్తు గోదావరిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఇద్దరు యువకులను ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న సిఐ రమేష్, ఎస్సై నరేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు సందీప్, మణికుమార్‌లు గా గుర్తించారు. బోటు ద్వారా గోదావరిలో గాలిస్తుండగా సందీప్ కుమార్ మృత దేహం లభ్యమైంది. మరో యువకుడు మణికుమారు ఆచూకి కోస గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మణికుమార్ మణుగూరు గాంధి బొమ్మ సెంటర్ కు చెందిన యువకుడిగా గుర్తించారు. రాత్రి పొద్దుపోయే వరకు గాలింపు చర్యలు చేపట్టినా మణికుమార్ ఆచూకి లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
గోదావరిలో ఇద్దరు గల్లంతు
RELATED ARTICLES