ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించేలా చర్యలు : మంత్రి హరీశ్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్: కరోనా ఆంక్షల అంశంపై ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తామని, పూర్తి ఉత్తర్వులు అందిన తరువాత, వాటిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఆరోగ్య శ్రీ నిధుల విడుదలలో ఆలస్యం లేకుండా ప్రతి నెలా బిల్లులు చె ల్లించేలా చర్యలు తీకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసియు,ఆపరేషన్ థియేటర్లను మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున దుర్గాబాయి ఆస్పత్రికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఒమిక్రాన్ కట్టడికి ఇప్పటికే పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామని, విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నామన్నారు. బూస్టర్ డోస్, పిల్లల టీకాపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. టీకాలు, కొవిడ్ కట్టడి చర్యలపై త్వరలో కేంద్రంతో చర్చిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశామని, అవకాశం ఉంటే దుర్గాభాయ్ ఆస్పత్రికి కూడా విస్తరిస్తామని తెలిపారు.ఆస్పత్రులపై మెగా సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, రోజుకు 35 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ను ఆ సంస్థ ప్రభుత్వానికి అందించిందని వెల్లడించారు. 6 నెలల క్రితం ఆక్సిజన్ దొరుకక ఇబ్బంది కలిగినప్పుడు మేఘ కృష్ణ రెడ్డికు చెబితే క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.
కోర్టు ఆదేశాలు గౌరవిస్తాం
RELATED ARTICLES