నిజాంపేట మండల రెవెన్యూ వ్యవస్థలో పైసలు ఇస్తేనే పనులు
ప్రజాపక్షం / నిజాంపేట: రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశం తో ‘సాదాబైనామా’, ‘ఈనాం’ భూములను పట్టా లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఈ మేరకు పనులు జరగడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. గత మూడేళ్ల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ భూ ములను పట్టా చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పైసలిస్తే కానీ పనులు జరగడం లేదని, భూ ములను పట్టా చేయడానికి వేలకు వేలు డబ్బు లు అడుగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిజాంపేట మండలంలోని గ్రామాలలో ఇంకా ఎంతోమంది రైతుల భూములు పట్టాలు కావాల్సి ఉన్నదని, కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసి పోయామని, జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా గానీ పనులు జరగడం లేదంటున్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని సమాధానం చెబుతున్నారని, తహసీల్దార్ కార్యాలయానిక వెళ్తే కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్ళమని తహసీల్దార్ చెబుతున్నారని వివరించారు. ఇలా మూడేళ్ల నుంచి ఈ రెండు కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నామే తప్ప పనులు భూములకు పట్టాలు మాత్రం ఇవ్వడం లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాలలోని రైతుల భూములకు పట్టాలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, తహసీల్దార్ కార్యాలయంలో జరిగే అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని నిజాంపేట మండలంలోని రైతులు కోరుతున్నారు.
సిబ్బంది కొరతతో ఇబ్బందులు : తహసీల్దార్ జయరాములు “కార్యాలయంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నాం. రైతులకు పాహనీ నకల్ కావాలంటే ఆ ఫైల్‌ను పాత పట్వారీలకే అప్ప చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది” అని తహసీల్దార్ జయరాములు ‘ప్రజాపక్షం’ విలేకరికి చెప్పారు.
మూడేళ్లయినా సాదాబైనామా, ఈనాం భూములు పట్టా కాలేదు
RELATED ARTICLES