వ్యవసాయ చట్టాలపై సందిగ్ధంలో ‘సుప్రీం’ కమిటీ!
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేసిన సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ నివేదికను సమగ్ర విశ్లేషణ తర్వాతే విడుద ల చేస్తారు. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీలో ఒక సభ్యుడుగా ఉన్న అనిల్ ఘన్వత్ సోమవారం ఈ విషయం వెల్లడించారు. ఈ కమి టీ నివేదిక రైతులకు అనుకూలంగా ఉందని ఆయ న అన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ మంత్రుల కమిటీ మధ్య 11 విడతలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో సుప్రీంకోర్టే స్వయంగా చొరవ తీసుకుని ధర్మాసనమే స్వయంగా కమిటీ సభ్యులను ఎంపిక చేసింది. ఈ మూడు చట్టాలను సమగ్రం గా, క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఈ చట్టాలు వర్తించే వివిధ రంగాలవారితో సంప్రదించి, ఆ చట్టాల్లో రైతుల మనుగడకు, వ్యవసాయ రంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలేమిటో విశ్లేషించి ఒక నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఆదేశించింది. సుప్రీంకోర్టు కోరినవిధంగానే ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి ఆ నివేదికను ఈ ఏడాది మార్చి 19వ తేదీన సు్రప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను సుప్రీంకోర్టు ఇప్పటి వరకు బయటకు వెల్లడించలేదు. ఈ పూర్వరంగంలోనే ఈ అధ్యయన కమిటీలో రైతుల తరపున సభ్యుడుగా ఉన్న అనిల్ ఘ న్విత్ మాట్లాడుతూ, ఈ నివేదికను విడుదల చేయడంలో ఉన్న న్యాయపరమైన పరిణామాల ను విశ్లేషించిన తర్వాత దానిని విడుదల చేయా లో వద్దో తాను నిర్ణయిస్తానని, ఈ మేరకు మిగిలి న ఇద్దరు సభ్యులు తనకు వారితో మాట్లాడే స్వేచ్చ ఇచ్చారని చెప్పారు. ఈ కమిటీలో అశోక్ గులాటి (వ్యవసాయ రంగ ఆర్థికవేత్త,వ్యవసాయ వ్యయాలు కమిషన్ మాజీ ఛైర్మన్), ప్రమోద్ కుమార్ జోషి (వ్యవసాయరంగ ఆర్థికవేత్త,దక్షిణాసియా అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనాసంస్థ డైరెక్టర్)లు కూడా సభ్యులుగా ఉన్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలు మూడింటినీ రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో తమ కమిటీ సోమవారం సమావేశం జరిపి దీనిపై చర్చించిందని ఘన్వత్ పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నివేదికను బాహ్య ప్రపంచానికి విడుదల చేయాలా? వద్దా? అనే విషయంపై తమ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. అయితే దీనివల్ల వచ్చే న్యాయపరమైన తదుపరి పరిణామాలు ఏమిటో, ఎలా ఉంటాయో విశ్లేషించిన తర్వాతే బాహ్య ప్రపంచానికి విడుదల చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఘన్వత్ చెప్పారు. తనతోపాటు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మిగిలిన ఇద్దరూ తనలాగా రైతు నాయకులు కాదని, వారు ఇద్దరూ వ్యవసాయ రంగ ఆర్థికవేత్తలని ఘన్వత్ చెప్పారు. ఈ నివేదికను ఈ ఏడాది మార్చినెల 19వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించిన తర్వాత ఆ నివేదికలో ఏమి ఉందో, రైతులకు హాని చేసే అంశాలు ఉన్నాయా? లేక ప్రయోజనం చేకూర్చే అంశాలు ఆ నివేదికలో ఉన్నాయా? అనే విషయం తెలుసుకునే అవకాశం రాలేదు. ఆ నిదికను ఇప్పటివరకు బహిరంగంగా విడుదల చేయలేదు. బాహ్య ప్రపంచం తెలుసుకునేందుకు వీలుగా ఈ నివేదికను విడుదల చేయాలని అనిల్ ఘన్వత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పటికే ఒక పెద్ద లేఖ రాశారు. ఈ నివేదికలోని అంశాలను బాహ్య ప్రపంచం తెలుసుకుంటే రైతులు కొనసాగిస్తున్న ఉద్యమ సమస్య పరిష్కారానికి వీలు కలుగుతుందని తన లేఖలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆనాడే కోరారు. అనిల్ ఘన్వత్ షేత్కారీ సంఘటన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
ఎంఎస్‌పికి చట్టబద్దత ఇవ్వాలి
దేశ విస్తృత ప్రయోజనాలరీత్యా, వ్యవసాయ రంగ సంక్షేమం రీత్యా సుప్రీం నిపుణుల కమిటీ నివేదికను విడుదల చేయాలనే తాము కోరుకుంటున్నామని ఆ కమిటీ సభ్యుడైన ఘన్వత్ అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం చేసినంతమాత్రాన వ్యవసాయదారుల ఉద్యమం అంతం కాబోదని గతవారమే ఘన్వత్ కేంద్రాన్ని హెచ్చరించారు. రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్దత ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారని, ముందు ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ డిమాండ్ పరిష్కారం కానిదే రైతు ఉద్యమం సమసిపోదని ఆయన హెచ్చరించారు. ఎంఎస్‌పికి చట్టబద్దత ఇస్తే, బిజెపికి రాజకీయంగా కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన హితవు చెప్పారు. కానీ ఇలా ఈ మూడు చట్టాలను రద్దు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. రైతులకు కొంత స్వేచ్ఛ లభించింది, కానీ ప్రస్తుతం ఇకమీదట కూడా వారు దోపిడీకి గురవుతారు, బ్రిటీష్ కాలంలోనూ, ఆ తర్వాత స్వాతంత్వ్రం వచ్చినప్పటినుండీ రైతులు దోపిడీకి గురవుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నివేదిక విడుదల చేయాలా? వద్దా?
RELATED ARTICLES