స్పర్శ ముఖ్యంకాదన్న సుప్రీం కోర్టు
వివాదాస్పద బోంబే కోర్టు తీర్పు కొట్టివేత
మహిళాసంఘాలు, తల్లిదండ్రుల హర్షం
న్యూఢిల్లీ : బాలికపై లైంగిక దాడి కేసులో వివాదాస్పదమైన, అంత్యత చర్చనీయాంశంగా మారిన బోంబే హైకోర్టు (నాగపూర్ ధర్మాసనం) తీర్పును సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. లైంగికదాడి కేసుల్లో శరీరాల మధ్య స్పర్శ తప్పనిసరిగా ఉండి తీరాలని, దాన్నే ప్రధానాంశంగా పరిగణిస్తామని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. శరీరాన్ని స్పృశించడం ముఖ్యం కాదని, నిందితుడికి లైంగికదాడి చేయాలన్న తలంపునే ప్రధాన సాక్ష్యంగా పరిగణించాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు హర్షతిరేకాలు ప్రకటించారు.జస్టిస్ యు యు లలిత్ సారథ్యంలోగల సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. పన్నెండేళ్ళ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో బాలిక శరీరాన్ని సదరు లైంగిక దాడి చేసిన వ్యక్తి తాకలేదని, కేవలం దుస్తులు ధరించినప్పుడు మాత్రమే ఆమె రహస్యాంగాలను నిందితుడు తాకినందువల్ల శరీరాన్ని స్పృశించనట్టు కాదని, దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై తల్లితండ్రులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిరసనలు వ్యక్తం చేశారు. బోంబే కోర్టు తీర్పును గడచిన ఫిబ్రవరిలో జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో గురువారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పు చెల్లదని కొట్టివేసింది. గడచిన జనవరిలో ముంబయి హైకోర్టుకు విచారణకు వచ్చిన ఈ కేసులో సాక్షాత్తూ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్పా వి గణేదివాలా ఈ తీర్పు ఇచ్చారు. ఇలాంటి తీర్పులు సమాజానికి, నేరస్తులకు తప్పుడు సంకేతాలు అందజేస్తాయని, ఈ తీర్పు భవిష్యత్ చరిత్రలో దుష్ట సంప్రదాయాలను నమోదు చేస్తాయని నిపుణులు, సామాజికవేత్తలు నిరసన తెలియజేసి తక్షణం ఈ తీర్పును కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తులు చేశారు. తల్లిదండ్రులు ఇళ్ళల్లో లేనని సమయంలో ఎవరైనా బాలికలపై లైంగిక దాడులు చేసినప్పుడు ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఆ బాలికలు సత్యాన్ని పెద్దల దృష్టికి తీసుకురావడాననికి సందేహిస్తారని, నేరస్తులు తపిపచుకునే ప్రమాదం ఉందని కూడా సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీకోర్టు తీర్పు సందర్భంగా హైకోర్టు తీర్పును తప్పుపడుతూ, నిందితుడికి బాలికపై లైంగిక దాడి చేయాలనే తలంపు కలిగిందా? లేదా? ఆ చర్యకు పాల్పడ్డాడా? లేదా? అనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించాలి తప్ప, నిందితుడు బాలిక శరీరాన్ని తాకాడా? తాకలేదా? అనే విషయాన్ని ప్రధానాంశంగా చూడకూడదని, ఇలాంటి వాదనలతో నిందితులు చట్టం నుండి తప్పించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బోంబే హైకోర్టు తీర్పు ఉద్దేశం వల్ల అంగీకాం లేకుండా చేసే లైంగిక ప్రవర్తనను అనుద్దేశపూర్వకంగా సమర్థించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. శరీరం తాకాయా? అనే అంశం తీర్పు ఇవ్వడంలో ప్రధానాంశం కాదని, దీనివల్ల చట్ట ప్రయోజనం నెరవేరదని, దాడికి పాల్పడిన నిందితుడి దుష్టతలంపే ప్రధానాంశమని పేర్కొంది. శాసనం స్పష్టంగా చెబుతున్నప్పుడు పోస్కో చట్టం కింద బాలికలకు రక్షణ కల్పించే విషయంలో న్యాయస్థానం సందేమాలు సృష్టించకూడదని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు.అసలు ఏం జరిగిందంటే, 39 ఏళ్ళ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2016 డిసెంబరులో పన్నెండేళ్ళు వయసుగల ఆమె కుమార్తెను ఒక వ్యక్తి మభ్యపెట్టి ఇంటికి తీసుకువెళ్ళి మెడ కింది భాగంపై చేతులతో దాడి చేశాడు. ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. ఈ చర్యల ద్వారా ఆ నిందితుడు తన కుమార్తెపై అత్యాచార ప్రయత్నం చేశాడని బాలిక తల్లి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. కోర్టు తీర్పును అప్పట్లో అటార్నీ జనరల్ వేణుగోపాల్ ఆనాటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే సారథ్యంలోగల ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భవిష్యత్‌లో ఎవరైనా చేతులకు గ్లౌజులు ధరించి ఇదేవిధంగా లైంగిక దాడికి పాల్పడితే నేరస్తుల్ని శిక్షించడం కష్టం అవుతుందని, ఇది దుష్ట సంప్రదాయాలకు దారితీస్తుందని, నేరస్తులన్న ప్రోత్సహించినట్లు అవుతుందని అటార్నీ జనరల్ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేయడంతో ధర్మాసనం హైకోర్టు తీర్పును పక్కకు నెట్టింది. దీనిపై గురువారం స్పష్టమైన తీర్పు వెలువడింది.
హర్షం ప్రకటించిన
జాతీయ మహిళా కమిషన్
బాలికపై లైంగికదాడి కేసులో నాగపూర్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సుప్రీకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) స్వాగతిచింది. బాలికలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘పోస్కో’ చట్టం కింద శరీరం మధ్య స్పర్శ జరిగినప్పుడే లైంగిక దాడిగా పరిగణిస్తామన్న నాగపూర్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయడంపట్ల కమిషన్ హర్షంప్రకటిస్తూ, ఈ తీర్పు మహిళలు, చిన్నారులకు రక్షణ న్యాయపరమైన రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. బాలికలపై లైంగిక దాడులు జరిగినప్పుడు దాడి చేయాలన్న ఉద్దేశమే ప్రధానం తప్ప, శరీర స్పర్శ ప్రధానం కాదని పేర్కొంది. గడచిన ఫిబ్రవరినెల 4వ తేదీన మహిళా కమిషన్ బోంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సంకుచిత భావాలతో చట్టాలకు భాష్యం చెప్పిన బోంబే కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరింది
దుస్తుల పైనుంచి స్పృశించినా లైంగిక దాడే!
RELATED ARTICLES