అవార్డు స్వీకరించిన హైదరాబాదీ క్రికెటర్
క్రీడా పురస్కారాలు అందచేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా పురస్కారం ‘ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ అవార్డును హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అందుకున్నారు. మహిళల వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు (7,391) సాధించిన క్రికెటర్‌గా రికార్డును నెలకొల్పిన మిథాలీ, అంతర్జాతీయ కెరీర్లో ఎక్కువ పరుగులు (10,273) చేసిన క్రికెటర్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన చార్లొట్ ఎడ్వర్డ్ రికార్డును అధిగమించింది. భారత క్రీడా రంగానికి అత్యుత్తమ సేవలు అందించిన ఆమెను ప్రభుత్వం ఇప్పటికే ‘అర్జున్’, ‘పద్మశ్రీ’ అవార్డులతో సత్కరించింది. తాజాగా మరో 11 మందితో కలిసి ప్రతిష్టాత్మకమైన ‘ఖేల్ రత్న’ అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించింది. శనివారం నాటి కార్యక్రమంలో రాష్ట్రపతి 12 మందికి ఖేల్త్న్ర 35 మందికి అర్జున అవార్డులు ప్రదానం చేశారు.
ఖేల్త్న్ర అవార్డీలు వీరే..
1. మిథాలీ రాజ్ (క్రికెట్), 2. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), ౩. రవి కుమార్ (రెజ్లింగ్), 4. లొవినా బొర్గొహైన్ (బాక్సింగ్), 5. పిఆర్ శ్రీజేష్ (హాకీ), 6. అవని లెఖారా (పారా షూటింగ్), 7. సుమీత్ అంటిల్ (పారా అథ్లెటిక్స్), 8. ప్రమోద్ భగత్ (పారా బాడ్మింటన్), 9. కృష్ణ నాగర్ (పారా బాడ్మింటన్), 10. మనీష్ నర్వాల్ (పారా షూటింగ్), 11. సునీల్ ఛత్రి (ఫుట్‌బాల్), 12. మన్‌ప్రీత్ సింగ్ (హాకీ).