HomeNewsBreaking Newsప్రశ్నిస్తే దేశద్రోహం

ప్రశ్నిస్తే దేశద్రోహం

నిలదీస్తే ఇడి, ఐటి దాడులు
కేంద్ర సర్కార్‌పై నిప్పులు చెరిగిన సిఎం కెసిఆర్‌
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని శుక్రవారం రైతులతో కలిసి టిఆర్‌ఎస్‌ ధర్నా
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దేశద్రోహులనే ముద్ర వేస్తా రా అని బిజెపి నేతలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిలదీశారు. వ్యవసాయ చట్టాలను మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ వ్యతిరేకించారని, బిజెపి ఎంపి వరుణ్‌గాంధీ కూడా రైతులకు సంఘీభావం వ్యక్తం చేశారని, వారు కూడా దేశ ద్రోహులా అని ప్రశ్నించారు. బిజెపి ఏమైనా దేశ ద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీనా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పండించే వరి ధా న్యాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొనుగోలు చేపిస్తారా? లేదా? అని తాను సూటిగా అడిగిన ప్రశ్నకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం లో పండించిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇకపై బిజెపిని వదిలిపెట్టబోమని, వారిని వెంటాడుతామని, వేటాడుతామని చెప్పారు. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేసే ధర్నాకు కలిసొచ్చే వారిని కలుపుకుంటామని, అలాగే బండి సంజయ్‌ కూడా రావొచ్చన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సెస్‌ తగ్గిస్తారా లేదా అని చెప్పాలని బిజెపి నేతలు, కేంద్ర ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు. సెస్‌ తగ్గించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా, సెస్‌ తగ్గిస్తారా లేదా సూటిగా సమాధానం చెప్పాలంటే బండి సంజయ్‌ ఏదో మసిపూసి మారడి చేస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడారన్నారు. 60 లక్షల వరి ఎక్కడుందో ఆరు హెలికాప్టర్‌లలో తీసుకెళ్లి చూపిస్తామని, ఇందులో బండి సంజయ్‌ని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తీసుకెళ్తామన్నారు. లేని పంటను ఉన్నట్టు చెప్పేందుకు తాము మోసగాళ్లం కాదన్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం నీతి బయటపడాలన్నారు. మిగతా రాష్ట్రాల మాదిరి తెలంగాణ రాష్ట్రంలో కూడా తోడేళ్ల తరహా పడుతామంటే కుదరదని, అలాంటి గారడిని నడనివ్వబోమని, తెలంగాణ రాష్ట్రానికి తాము కాపలాదారులమన్నారు. తన కోన ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైతులు, ప్రజల కోసమే కొట్లాడుతామన్నారు. వడ్ల విషయంలో ప్రజల ముందు బిజెపిని పంచనామా చేస్తామని, బ్లాస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. దేశ ప్రజలపై బిజెపికి ప్రేమ ఉంటే పెట్రోల్‌, డీజిల్‌లపై సెస్‌ను ఉపసంహరించుకోవాలని కెసిఆర్‌ డిమాండ్‌ చేశారు. అలా చేస్తే పాత రేట్లకే డీజిల్‌ రూ. 68, పెట్రోల్‌ రూ. 77లకే వస్తుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై తాము వ్యాట్‌ పెంచలేదని, రేషనలైజేషన్‌ మాత్రమే చేశామన్నారు. దేశంలో బ్యాడ్‌ బిజినెస్‌ ఎకనామీ పాలసీ ఉన్నదన్నారు. దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ సింగూర్‌కు ఎంతో మంది పర్యాటకులు వస్తారని, ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమన్నారు. దేశాన్ని సంస్కరించాలని, ప్రజలు, యువత కోసం దేశం కొత్త పుంథాలు రావాలని, నూతన ఆర్థిక వ్యవస్థ రావాలని, అద్భుతాలు ఆవిష్కరించాలని తెలిపారు. ఇతర దేశాల నుంచి భారతదేశం నేర్చుకోవాలని, మనం ఇంకా మేలుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ బిల్లుకు ఓటు వేయలేదా? ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమంలో ఉన్నప్పుడు బండి అడ్రస్‌ ఎక్కడా? అని, అప్పుడు ఆయన ఎవరో తెలియదన్నారు. బిజెపి నేతల మాటలను రైతులు నమ్మితే శంకరగిరి మాన్యాలకుపోవాల్సి వస్తుందని, అందుకే యాసంగిలో వరి పంటకు బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రశ్నిస్తే దేశద్రోహులు… ఆపై ఇడి, ఐటి దాడులు
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, కేంద్ర బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు తాము దేశద్రోహులం కాదా అని సిఎం కెసిఆర్‌ అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుందని, దానిని కాపాడాలంటే దేశ ద్రోహులమవుతామా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిని, గట్టిగా మాట్లాడిన వారిపై దేశద్రోహులని, లేదా అర్బన్‌ నక్సలైట్‌ అని బిజెపి ఇలా రెండు రకాల స్టాంప్‌ వేస్తుందని, దేశ వ్యాప్తంగా బిజెపి స్టుల్‌ ఇదేనని, ఇలాంటి బెదింపులకు భయపడబోమన్నారు. ప్రశ్నించిన , ఎదిరించిన వారిపై ఆదాయ పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ తో దాడులు చేయిస్తారని, అన్యాయంగా కేసులు నమోదు చేస్తారని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిజెపి స్టుల్‌ ఇదేనని ఆరోపించారు.ఇలాంటి పిట్ట బెదిరింపులకు తాము భయపడమన్నారు.
గొర్ల పంపణీకి ఏకాణ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
గొర్ల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకాణ ఇచ్చినట్టు నిరూపించినా తాను ఒక్క నిమిషంలో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్‌కు సిఎం కెసిఆర్‌ సవాల్‌ విసిరారు. తాము నేషనల్‌ కో- ఆపరేటీవ్‌ బ్యాంక్‌ నుంచి అప్పులు తీసుకున్నామని, ఇప్పటికీ వడ్డీ కడుతున్నామని తెలిపారు. గొర్ల పంపిణీని ,పెన్షన్‌ను బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పెట్రోల్‌ ఎందుకు పెంచారంటే తక్కువ కావాలంటే పాకిస్తాన్‌, అప్గనిస్తాన్‌కు పోవాలని చెబుతున్నారన్నారు.
ఏ విచారణకైనా సిద్ధమే
తాము ఏ విచారణకైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. ఏ తప్పు చేయలేదని, చేసే ఖర్మ కూడా లేదన్నారు. కక్షసాధింపు చర్యలు, అడ్డగోలు దాడులు, ఆదాయ పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులకు తాము ఎందుకు భయపడుతామని కెసిఆర్‌ అన్నారు. తన ఫామ్‌హౌస్‌ వద్ద అడుగు పెట్టి చూడాలని, ఆరు ముక్కలు అవుతారని ఆయన బండి సంజయ్‌ని హెచ్చరించారు. తన ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటున్న బండి సంజయ్‌ ఏమైనా ట్రాక్టర్‌ డ్రైవరా అని ఎద్దేవా చేశారు. తాను మందు తాగుతానని మాట్లాడుతున్న బండి సంజయ్‌ తనకు ఏమైనా మందు కలిపి ఇచ్చారా? ఆయన గురువు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. అక్కడో, ఇక్కడో బెదిరంచినట్టు తమను బెదిరించలేరని, తాము నిఖార్సుగా, నిటారుగా ఉన్నామని, ఎవరితోనైనా పోరాడుతామని తెలిపారు. పెళ్లి, చావు , తేలు తదితర వాటన్నింటికీ ఒకే మంత్రం నడువదని, కొన్ని సార్లు బూమారాంగ్‌ అవుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో రివర్స్‌ అవుతాయన్నారు. తెలంగాణ ఉద్యమకారులే మొత్తం క్యాబినెట్‌లో ఉంటారా? ఉద్యమకారులకు సమయ సందర్భంలో అవకాశాలు ఉంటాయని, ఎవరి శక్తి సమర్థ్యం బట్టి వారికి పదువుల వస్తాయన్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జ్యోతిరాధిత్యను కేంద్ర క్యాబినెట్‌లో ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.
పాదయాత్రలో రైతులు నిలదీస్తరు
బిజెపి నేతలను, ఆ పార్టీ ఎంపిలను గ్రామాల్లోని రైతులు నిలదీయాలని కెసిఆర్‌ పిలుపునిచ్చారు. వరి ధాన్యాన్ని కొంటారా?లేదా అని ప్రశ్నించాలని తెలిపారు. బిజెపి నేతలు ఇప్పుడు పాదయాత్ర చేయాలని ఎద్దేవా చేశారు. దళితబంధు యధాతథంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో దళితబంధుకు రూ. 20వేల కోట్ల నిధులు కేటాయిస్తామని, తద్వారా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయన్నారు.

70వేల ఖాళీల నోటిఫికేషన్‌
ప్రతి ఏటా ఎంప్లాయ్‌మెంట్‌ క్యాలెండర్‌
ఉద్యోగాలను సెట్‌ చేసిన తర్వాత 60 నుంచి 70వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. ప్రతి ఏటా ఎంప్లాయ్‌మెంట్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని హామీనిచ్చారు. తాను ఇంటికో ఉద్యోగం అన్నట్టు బండి సంజయ్‌ నిరూపిస్తావా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఇబ్బందిపడొద్దని, ఉద్యోగ కల్పన జరుగుతుందని, స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇకపై బిజెపిని వదిలిపెట్టబోమని, వారిని వెంటాడుతామని, వేటాడుతామని చెప్పారు. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేసే ధర్నాకు కలిసొచ్చే వారిని కలుపుకుంటామని, అలాగే బండి సంజయ్‌ కూడా రావొచ్చన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సెస్‌ తగ్గిస్తారా లేదా అని చెప్పాలని బిజెపి నేతలు, కేంద్ర ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు. సెస్‌ తగ్గించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా, సెస్‌ తగ్గిస్తారా లేదా సూటిగా సమాధానం చెప్పాలంటే బండి సంజయ్‌ ఏదో మసిపూసి మారడి చేస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడారన్నారు. 60 లక్షల వరి ఎక్కడుందో ఆరు హెలికాప్టర్‌లలో తీసుకెళ్లి చూపిస్తామని, ఇందులో బండి సంజయ్‌ని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తీసుకెళ్తామన్నారు. లేని పంటను ఉన్నట్టు చెప్పేందుకు తాము మోసగాళ్లం కాదన్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం నీతి బయటపడాలన్నారు. మిగతా రాష్ట్రాల మాదిరి తెలంగాణ రాష్ట్రంలో కూడా తోడేళ్ల తరహా పడుతామంటే కుదరదని, అలాంటి గారడిని నడనివ్వబోమని, తెలంగాణ రాష్ట్రానికి తాము కాపలాదారులమన్నారు. తన కోన ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైతులు, ప్రజల కోసమే కొట్లాడుతామన్నారు. వడ్ల విషయంలో ప్రజల ముందు బిజెపిని పంచనామా చేస్తామని, బ్లాస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. దేశ ప్రజలపై బిజెపికి ప్రేమ ఉంటే పెట్రోల్‌, డీజిల్‌లపై సెస్‌ను ఉపసంహరించుకోవాలని కెసిఆర్‌ డిమాండ్‌ చేశారు. అలా చేస్తే పాత రేట్లకే డీజిల్‌ రూ. 68, పెట్రోల్‌ రూ. 77లకే వస్తుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై తాము వ్యాట్‌ పెంచలేదని, రేషనలైజేషన్‌ మాత్రమే చేశామన్నారు. దేశంలో బ్యాడ్‌ బిజినెస్‌ ఎకనామీ పాలసీ ఉన్నదన్నారు. దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ సింగూర్‌కు ఎంతో మంది పర్యాటకులు వస్తారని, ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమన్నారు. దేశాన్ని సంస్కరించాలని, ప్రజలు, యువత కోసం దేశం కొత్త పుంథాలు రావాలని, నూతన ఆర్థిక వ్యవస్థ రావాలని, అద్భుతాలు ఆవిష్కరించాలని తెలిపారు. ఇతర దేశాల నుంచి భారతదేశం నేర్చుకోవాలని, మనం ఇంకా మేలుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ బిల్లుకు ఓటు వేయలేదా? ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమంలో ఉన్నప్పుడు బండి అడ్రస్‌ ఎక్కడా? అని, అప్పుడు ఆయన ఎవరో తెలియదన్నారు. బిజెపి నేతల మాటలను రైతులు నమ్మితే శంకరగిరి మాన్యాలకుపోవాల్సి వస్తుందని, అందుకే యాసంగిలో వరి పంటకు బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రశ్నిస్తే దేశద్రోహులు… ఆపై ఇడి, ఐటి దాడులు
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, కేంద్ర బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు తాము దేశద్రోహులం కాదా అని సిఎం కెసిఆర్‌ అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుందని, దానిని కాపాడాలంటే దేశ ద్రోహులమవుతామా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిని, గట్టిగా మాట్లాడిన వారిపై దేశద్రోహులని, లేదా అర్బన్‌ నక్సలైట్‌ అని బిజెపి ఇలా రెండు రకాల స్టాంప్‌ వేస్తుందని, దేశ వ్యాప్తంగా బిజెపి స్టుల్‌ ఇదేనని, ఇలాంటి బెదింపులకు భయపడబోమన్నారు. ప్రశ్నించిన , ఎదిరించిన వారిపై ఆదాయ పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ తో దాడులు చేయిస్తారని, అన్యాయంగా కేసులు నమోదు చేస్తారని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిజెపి స్టుల్‌ ఇదేనని ఆరోపించారు.ఇలాంటి పిట్ట బెదిరింపులకు తాము భయపడమన్నారు.
గొర్ల పంపణీకి ఏకాణ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
గొర్ల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకాణ ఇచ్చినట్టు నిరూపించినా తాను ఒక్క నిమిషంలో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్‌కు సిఎం కెసిఆర్‌ సవాల్‌ విసిరారు. తాము నేషనల్‌ కో- ఆపరేటీవ్‌ బ్యాంక్‌ నుంచి అప్పులు తీసుకున్నామని, ఇప్పటికీ వడ్డీ కడుతున్నామని తెలిపారు. గొర్ల పంపిణీని ,పెన్షన్‌ను బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పెట్రోల్‌ ఎందుకు పెంచారంటే తక్కువ కావాలంటే పాకిస్తాన్‌, అప్గనిస్తాన్‌కు పోవాలని చెబుతున్నారన్నారు.
ఏ విచారణకైనా సిద్ధమే
తాము ఏ విచారణకైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. ఏ తప్పు చేయలేదని, చేసే ఖర్మ కూడా లేదన్నారు. కక్షసాధింపు చర్యలు, అడ్డగోలు దాడులు, ఆదాయ పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులకు తాము ఎందుకు భయపడుతామని కెసిఆర్‌ అన్నారు. తన ఫామ్‌హౌస్‌ వద్ద అడుగు పెట్టి చూడాలని, ఆరు ముక్కలు అవుతారని ఆయన బండి సంజయ్‌ని హెచ్చరించారు. తన ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటున్న బండి సంజయ్‌ ఏమైనా ట్రాక్టర్‌ డ్రైవరా అని ఎద్దేవా చేశారు. తాను మందు తాగుతానని మాట్లాడుతున్న బండి సంజయ్‌ తనకు ఏమైనా మందు కలిపి ఇచ్చారా? ఆయన గురువు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. అక్కడో, ఇక్కడో బెదిరంచినట్టు తమను బెదిరించలేరని, తాము నిఖార్సుగా, నిటారుగా ఉన్నామని, ఎవరితోనైనా పోరాడుతామని తెలిపారు. పెళ్లి, చావు , తేలు తదితర వాటన్నింటికీ ఒకే మంత్రం నడువదని, కొన్ని సార్లు బూమారాంగ్‌ అవుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో రివర్స్‌ అవుతాయన్నారు. తెలంగాణ ఉద్యమకారులే మొత్తం క్యాబినెట్‌లో ఉంటారా? ఉద్యమకారులకు సమయ సందర్భంలో అవకాశాలు ఉంటాయని, ఎవరి శక్తి సమర్థ్యం బట్టి వారికి పదువుల వస్తాయన్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జ్యోతిరాధిత్యను కేంద్ర క్యాబినెట్‌లో ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.
పాదయాత్రలో రైతులు నిలదీస్తరు
బిజెపి నేతలను, ఆ పార్టీ ఎంపిలను గ్రామాల్లోని రైతులు నిలదీయాలని కెసిఆర్‌ పిలుపునిచ్చారు. వరి ధాన్యాన్ని కొంటారా?లేదా అని ప్రశ్నించాలని తెలిపారు. బిజెపి నేతలు ఇప్పుడు పాదయాత్ర చేయాలని ఎద్దేవా చేశారు. దళితబంధు యధాతథంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో దళితబంధుకు రూ. 20వేల కోట్ల నిధులు కేటాయిస్తామని, తద్వారా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయన్నారు.

70వేల ఖాళీల నోటిఫికేషన్‌
ప్రతి ఏటా ఎంప్లాయ్‌మెంట్‌ క్యాలెండర్‌
ఉద్యోగాలను సెట్‌ చేసిన తర్వాత 60 నుంచి 70వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. ప్రతి ఏటా ఎంప్లాయ్‌మెంట్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని హామీనిచ్చారు. తాను ఇంటికో ఉద్యోగం అన్నట్టు బండి సంజయ్‌ నిరూపిస్తావా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఇబ్బందిపడొద్దని, ఉద్యోగ కల్పన జరుగుతుందని, స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments