HomeNewsBreaking Newsఎర్రజెండాలు ఒక్కటి కావాలి

ఎర్రజెండాలు ఒక్కటి కావాలి

రావి నారాయణరెడ్డి వర్ధంతి సభలో సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజాస్వామ్యం, రాజ్యాంగరక్షణ తక్షణ కర్తవ్యం

ప్రజాపక్షం / హైదరాబాద్‌ గతంతో పోల్చితే కమ్యూనిస్టు పార్టీలు బలహీనమయ్యాయని, అనేక పార్టీలుగా విడిపోయాయ ని, వాటన్నిటినీ ఐక్యం చేసి దేశంలో ఫాసిస్టు మతతత్వ ప్రభుత్వం బారి నుండి ప్రజాస్వామ్యా న్ని, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట సేనాని, పార్లమెం టు మాజీ సభ్యులు, ప్రముఖ కమ్యూనిస్టు రావి నారాయణరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో మంగళవారం సభ జరిగిం ది. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రావి నారాయణరెడ్డి ట్రస్టు అధ్యక్షులు సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎఐటియుసి నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, రావి నారాయణరెడ్డి మనవరాలు ప్రతిభ తదితరులు హాజరయ్యారు. తొలుత కార్యక్రమానికి హాజరైన వారం తా రావి నారాయణరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాం వ్యతిరేక పోరాటంలో రావి నారాయణరెడ్డి త్యాగాల పోరాటాలకు లక్షలాది మంది ప్రజ లు ఉత్తేజితులయ్యారని గుర్తు చేశారు. తొలుత గాంధేయవాదిగా ఉన్న ఆయన హరిజన హాస్టళ్ళను స్థాపించారని, ఖాదీనే ధరించేవారని, సత్యాగ్రహంలో పాల్గొన్నారని తెలిపారు. స్వాతం త్య్రం కోసం మరింత మిలిటెంట్‌ పోరాటాలు అవసరమని మరింత లోతైన ఆలోచనతో ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు ఉద్యమాలలో పాల్గొని నేతృ త్వం వహించారని చెప్పారు. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురిలో ఒకరైన రావి నారాయణరెడ్డి సరైన సమయంలో దానిని విరమించాలని సూచించారని, పిడివాద ధోరణితో పార్టీ నాయకత్వం అందుకు అంగీకరించలేదని, ఫలితంగా అనేకమంది నాయకులు, కార్యకర్తలను కోల్పోయమన్నారు. నారాయణ మాట్లాడుతూ నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో ఎంపిగా గెలుపొందిన రావి నారాయణరెడ్డితో పార్లమెం టు భవనాన్ని ప్రారంభించజేశారని, బహుశా అలాంటి చర్రిత ఉండకూదనే ఉద్దేశంతోనే మోడీ కొత్త పార్లమెంటు కడుతున్నారేమోనని అన్నారు. ఎర్ర జెండాలు ఒక్కటి కావాల్సిందేనని, అది ఏదో ఒక రోజు తప్పక జరుగుతుందని చెప్పారు. పాశం యాదగిరి మాట్లాడుతూ రావి నారాయణరెడ్డి ప్రాసంగికత ఇప్పటికీ ఉన్నదని, ఆయనను గుర్తు చేసుకోవడం ద్వారా ఆత్మశుద్ధి అవడంతో పాటు నేడు మన ముందు ఉన్న కర్తవ్యాన్ని గుర్తుకు తెస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాసంగికత పెరుగుతున్నదని, దేశంలో కమ్యూనిస్టులు విడివిడిగా ప్రయాణం చేస్తే ఉనికిలో లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి ఐక్యతకు కృషి జరగాలన్నారు. కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రావి నారాయణరెడ్డిని చరిత్ర మరిచిపోలేదని, చరిత్రను సృష్టించేది ప్రజలేనని అన్నారు. గతంలో ప్రైవేటైజేషన్‌ పేరుతో నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేవారని, నేటి మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను కూడా అమ్మేస్తుందని, ప్రైవేటీకరణకు మానిటైజేషన్‌ అనే కొత్త పేరు పెట్టిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఐకత్య విషయంలో సిపిఐ వైఖరి స్పష్టంగా ఉన్నదని, గతంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఒకరు ఐక్యతపై ముందుకు వచ్చి మళ్ళీ చేతులు ఎత్తేశారని అన్నారు. ఐక్యత విషయంలో పాశం యాదగిరి వంటి వారు చొరవ తీసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ అట్టడుగు వర్గాలను నిద్రలేపి తెలంగాణను నిజాం రాచరిక వ్యవస్థ నుండి విముక్తి చేసి భారతదేశంలో కలిపేందుకు కృషి చేసిన ప్రథమ వ్యక్తి రావి నారాయణరెడ్డి అని ప్రతాప్‌రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వాలు, పాలకులు, ప్రజలు మరిచిపోవడం సిగ్గు చేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రావి నారాయణరెడ్డి ముఖచిత్రంతో రెడ్డి జాగృతి మాసపత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రావి నారాయణరెడ్డి వంటి మహనీయుల చరిత్రను అన్ని వర్గాలకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో తాము పుస్తకం తీసుకువచ్చామని పుస్తక సంపాదకులు మాధవరెడ్డి తెలిపారు. రావి నారాయణరెడ్డిపై ప్రత్యేకంగా రాసిన గీతాన్ని ప్రజా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా పాడి వినిపించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments