అధికారుల తీరు ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోంది : మాజీ సిఎం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) అధ్యక్షురా లు మెహబూబా ముఫ్తిని మంగళవారంనాడు హౌస్ అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ పనితీరును తేటతెల్లం చేస్తోందని ఆమె అన్నారు. తన కదలికలను అడ్డుకోవడంవల్ల ప్రభుత్వం రా ష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవడంలోనే పరిస్థితి అర్థం అవుతోందన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆఫ్గనిస్థాన్లోని ప్రజల హక్కుల గురించి ఆందోళన పడుతున్నట్లు ప్రకటనలు గుప్పిస్తూనే, మరోవైపు ఆవే హక్కులను కశ్శీరీయులకు లేకుండా తిరస్కరిస్తోందని మండిపడ్డారు. “నన్ను గృహ నిర్బంధం చేశారు. కారణం ఏమిటంటే జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సర్వసాధార స్థితి లో లేవని పాలనాధికారులలు చెబుతున్నారు” అని మెహబూబా ముఫ్తి ట్వీట్ చేశారు. తను నివసిస్తున్న గుప్కార్ రెసిడెన్సీని భద్రతా బలగా లు చుట్టుముట్టిన చిత్రాలను ఆమె సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అయితే కశ్మీర్ పాలనా యంత్రాంగం వాదన మరోలా ఉంది. ముఫ్తి దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఒక కుటుంబ కార్యక్రమానికి హాజరవ్వాలని వాంఛించారని, అయితే ఈ జిల్లాలో పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నందున ఆమె కదలికలను నియంత్రించామని యంత్రాంగం పేర్కొంది. కశ్మీర్ లోయలో పరిస్థిలును ఉల్లంఘించి జాతి వ్యతిరేక శక్తులు చెలరేగిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల అక్కడ పర్యటించవద్దని అధికారులు ముఫ్తీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ మరణానంతర పరిస్థితులు ఇంకా చక్కబడలేదని, అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోందని అధికార యంత్రాంగం ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. గిలానీ మరణానంతరం ముఫ్తి ప్రభూత్వంపై విరుచుకుపడుతున్నారు. పాలనాయంత్రాంగం కశ్మీర్ లోయను బహిరంగ జైలుగా మార్చివేసిందని ఆమె నిశిత విమర్శలు చేస్తున్నారు. ఒక కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు, వారిని యుపిఎపి చట్టం కింద నిర్బంధించింది, ప్రభుత్వం తమకు అనుకూలమైన విధంగా అంత్యక్రియలకు అనుమతించింది. గిలానీ సాహెబ్ కుటుంబాన్ని కూడా అంక్షల చట్రంలో పెట్టింది, ఇదే ఈనాటి సరికొత్త భారతదేశంలోని నయా కశ్మీర్” అని ముఫ్తి తన ట్వీట్లో విమర్శించారు.
గిలానీ భౌతిక కాయంపై పాక్ జాతీయ జెండా
ముఫ్తి ఈ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే జమ్ము కశ్మీర్ పోలీసులు గిలానీ అంత్యక్రియల వీడియోను విడుదల చేశారు. సెప్టెంబరు 1వ తేదీన పాక్ అనుకూల వేర్పాటువా నాయకుడు గిలానీ సుదీర్ఘ అనారోగ్యంతో మరణించాడు. అతడి వయసు 91 సంవత్సరాలు. పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో, అంత్యక్రియల నిర్వహణకు గిలానీ ఇంటికి వెళ్ళినప్పుడు మూడు గంటలపాటు అధికారులను ఎదురు చూసేట్టు చేశారని పేర్కొన్నారు సెప్టెంబరు 1,2 తేదీల్లో తన నివాసంలో గిలానీ భౌతిక కాయం ఉన్న దృశ్యాలను, అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలను మూడు వీడియోల్లో పోలీసులు సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. గిలీనీ మరణానంతరం కశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ వారి నివాసానికి వెళ్ళి, గిలీనీ ఇద్దరు కుమారులను కలిసి, ప్రజా ప్రయోజనాలు, శాంతి భద్రతల దృష్ట్యా అంత్యక్రియలు రాత్రికే జరిపించాలని కోరారు. అందుకు వారు అంగీకరించి బంధువులందరూ వచ్చే వరకు రెండు గంటలు ఎదురుచూడమని కోరారని ట్విట్టర్లో పోలీసులు పేర్కొన్నారు. మూడు గంటల తర్వాత పాకిస్థాన్, వేర్పాటువాదుల ఒత్తిడిమేరకు గిలీనీ కుమారులిద్దరూ మరో విధంగా ప్రవర్తించడం ప్రారంభించారని, జాతి వ్యతిరేక చర్యలు చేపట్టడం ప్రారంభించారని, పాకిస్థాన్ జెండాతో గిలీనీ భౌతిక కాయాన్ని చుట్టి ఉంచి సందర్శకులకోసం పెట్టారని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత పాకిస్థాన్‌కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారని, దాంతో ఇరుగుపొరుగువారంతా వీధుల్లోకి వచ్చారని పోలీసులు టిట్టర్‌లో తెలిపారు. స్థానిక ఇమామ్, ఇంతిజామియా కమిటీ ఆధ్వర్యంలో అంత్యక్రియలన్నీ చాలా పదతిగా జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. శ్శశానవాటికకు గిలీనీ ఇద్దరు కుమారులు రావడానికి తిరస్కరించారని, వారికి తండ్రిపై ప్రేమ కంటే పాకిస్థాన ఎజెండా పైనే ఎక్కువ గౌరవం, విధేయత ఉందని పేర్కొన్నారు.