న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం, గత 24 గంటల్లో కొత్తగా 39,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది. 491 మంది మృతి చెందగా, కరోనా కారణంగా ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,27, 862కు చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా కొనసాగుతున్నది. 43,910 మంది కోలుకోగా, కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 3,10,99,771కి చేరింది. 97.4 శాతం రికవరీ కేసు నమోదు కావడం విశేషం. దేశంలో ప్రస్తుతం 4,06,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా 17, 22,221 కొవిడ్ పరీక్షలు జరిపారు. దీనితో ఈ పరీక్షల సంఖ్య 48,39,00,185కు చేరింది. కొత్తగా 55,91,657 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 50,68,10,492 వ్యాక్సిన్లు వేశారు. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ కేరళలో మాత్రం నిన్న దేశంలోనే ఎక్కువగా, 20.4వేల కొత్త కేసులు వచ్చాయి. ఆ తరువాత మహారాష్ట్రలో 6.06వేల కొత్త కేసులు, తమిళనాడులో 1.97 కొత్త కేసులు వచ్చాయి. మృతుల విషయానికి వస్తే, కేరళలో 139, మహారాష్ట్రలో 128, ఒడిశాలో 64 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 161 రోజుల తర్వాత, తొలిసారి యాక్టివ్ కేసులు 75వేల కంటే తగ్గాయి. కాగా, ప్రస్తుతం 9 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.
స్వల్పంగా పెరిగిన పాజిటివ్ కేసులు
RELATED ARTICLES