ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టును
తొలిసారి సెమీస్ చేర్చిన డ్రాగ్ ఫ్లికర్
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై 1- ఆధిక్యంతో విజయం సాధించి, తొలిసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్‌కు ఈ గౌరవాన్ని అందించిన ఘనత డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్‌కే దక్కుతుంది. కీలకమైన ఈ గోల్‌తో ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. హాకీలో భారత పురుషుల జట్టు ఆదివారం గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి, 49 సంవ్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సెమీ ఫైనల్ చేరుకోగా, వారి నుంచి స్ఫూర్తిని పొందిన రీతిలో మహిళలు మ్యాచ్ ప్రారంభం నుంచి ఆస్ట్రేలియాపై ఒత్తిడిని పెంచారు. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యచ్‌లను చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ అవకాశాలను అందిపుచ్చుకున్న ప్రపంచ 9వ ర్యాంక్ జట్టు భారత్ ఆది నుంచి చివరి వరకూ పోరాటాన్ని కొనసాగించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను నిలువరించడానికి జట్టులోని క్రీడాకారిణులు అంతా సర్వశక్తులు ఒడ్డారు. డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ మ్యాచ్ 22వ నిమిషంలో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సూపర్ గోల్ చేసింది. ఆతర్వాత భారత్ మరింత రక్షణాత్మకంగా ఆడింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణులు గోల్‌పోస్టుపై ఎన్ని పర్యాయాలు దాడులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, వాటిని విఫలం చేసింది. చివరికి మ్యాచ్‌ని కైవసం చేసుకొని, మొట్టమొదటిసారి ఒలింపిక్స్‌లో సెమీస్ చేరింది. ఫైనల్‌లో స్థానం కోసం అర్జెంటీనాను ఢీ కొంటుంది. అంతకుముందు అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌లో జర్మనీని 1 తేడాతో ఓడించింది. కాగా, మరో సెమీ ఫైనల్‌లో నెదర్లాండ్స్, బ్రిటన్ జట్లు తలపడతాయి. నెదర్లాండ్స్ 3 ఆధిక్యంతో న్యూజిలాండ్‌పై గెలవగా, బ్రిటన్ 2 తేడాతో స్పెయిన్‌పై విజయాన్ని నమోదు చేసింది.
డిస్కస్ త్రోలో నిరాశ
మహిళల డిస్కస్ త్రోలో భారత్‌కు నిరాశే ఎదురైంది. తప్పక పతకాన్ని కైవసం చేసుకుంటుందని అనుకున్న కమల్‌ప్రీత్ కౌర్ దారుణంగా విఫలమై ఆరో స్థానంతో సంతృప్తి చెందింది. ఆమె డిస్కస్‌ను 63.70 మీటర్ల దూరానికి విసరగలిగింది. కాగా, అమెరికాకు చెందిన వలారీ ఆల్‌మన్ (68.98 మీటర్లు), జర్మనీ త్రోయర్ క్రిస్టినీ ప్యూడెన్జ్ (66.86 మీటర్లు), క్యూబా స్టార్ యమీ పెరెజ్ (65.72 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
జయహో గుర్జీత్
RELATED ARTICLES