టోక్యో ఒలింపిక్స్‌లో సింధుకు కాంస్యం
టోక్యో : భారత బాడ్మింటన్ సూపర్ స్టార్ పివి సింధు సరికొత్త రికార్డు సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ద్వా రా, ఈ మెగా ఈవెంట్లో రెండు పతకాలు గెల్చుకున్న తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రను తిరగరాసింది. ఇంతకు ముందు రెజ్లర్ సుశీల్ కుమార్ రెండు ఒలింపిక్స్ పతకాలను సాధించగా, ఈ ఫీట్‌ను అందుకున్న తొలి భారత మహిళగా, భారత్‌కు చెందిన రెండో అథ్లెట్‌గా అరుదైన కీర్తిని సంపాదించుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి స్వర్ణ పతకాన్ని సాధించడమే లక్ష్యంగా టోక్యోలో బరిలోకి దిగిన సింధు అందరి అంచనాల మేరకే సెమీ ఫైనల్స్ వరకూ దూసుకెళ్లింది. కానీ, ఫైనల్ చేరడంలో విఫలమైంది. ప్రపంచ నంబర్ వన్, చైనీస్‌తైపీ క్రీడాకారిణి తాయ్ జు ఇంగ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, సెమీస్‌లో ఓడి న కారణంగా, నిబంధనలను అనుసరించి కాంస్య పతకం కోసం ప్లే ఆఫ్ మ్యాచ్‌కి అర్హత సంపాదించింది. మరో సెమీఫైనల్లో తన దేశానికే చెందిన చెన్ యు ఫెయ్ చేతిలో ఓడిన హి బింగ్ జియావోతో పోరును ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సింధు సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. ప్రత్యర్థి జియావో నుంచి ఎదురైన తీవ్రమైన పోటీని సమర్థంగా తిప్పికొడుతూ మ్యాచ్‌ని 21 21 తేడాతో వరుస సెట్లలో కైవసం చేసుకుంది. 52 నిమిషాలపాటు కొనసాగిన ఈ యుద్ధంలో గెలవడం ద్వారా ఒలింపిక్స్‌లో రెండో పతకాన్ని స్వీకరించింది. ఇది వరకు రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 బీజింగ్ (చైనా) ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్నాడు. సింధు రియోలో రజతం, టోక్యోలో కాంస్య పతకాలను అందుకొని, రెండు ఒలింపిక్ పతకాలతో అతని సరసన చోటు దక్కించుకుంది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
ఫెయ్కి స్వర్ణం
మహిళల బాడ్మింట్ సింగిల్స్ టైటిల్‌ను చైనా క్రీడాకారిణి చెన్ యు ఫెయ్ గెల్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె చైనీస్‌తైపీకి చెందిన తాయ్ జు ఇంగ్‌ను 21 19 21 తేడాతో ఓడించింది.
ప్రముఖుల ప్రశంసలు
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బాడ్మింటన్ సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం పివి సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీసహాపలువురు ప్రముఖులు సింధును అభినందించారు. దేశానికి గర్వకారణమైన సింధు దేశ క్రీడాప్రతిష్టను ఇనుమడింప చేసిందని ప్రశంసించారు. కోట్లాది మంది భారత యువతకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలను అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
చరిత్ర సృష్టించిన తెలుగు తేజం
RELATED ARTICLES