ఛార్జీషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్డు
ప్రజాపక్షం/హైదరాబాద్సినీ నటుల డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రాన్ని నాంపల్లికోర్టు విచారణకు స్వీకరించింది. నాలుగేళ్లతర్వాత సిట్ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను కోర్టు ఆమోదించింది. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేయడంతో పాటు, మరో 27 మందిని అధికారులు విచారించారు. 12 కేసుల్లో తొలుత 8 కేసుల్లో మాత్రమే సిట్ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో 11 మంది ప్రముఖులతో పాటు రవితేజ, డ్రైవర్ శ్రీనివాసును కూడా సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుమారు 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పట్టుబడిన డ్రగ్స్ ముఠా
హైదరాబాద్‌లో మరో సారి డ్రగ్స్ ముఠా పట్టబడింది. వారి నుంచి భారీగా మాదకద్రవ్యాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమన్ దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల కొకైన్, 8 గ్రాముల ఎండిఎంఎ, 73 ఎస్టక్ పిల్స్, 15 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఒక ఇంటిపై అధికారులు దాడి చేశారు. అక్కడ ఉన్న ఇద్దరు ఎమన్ దేశస్థులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోనికి తీసుకని విచారించగా ఈజ్ అనే నైజీరియన్ నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్టు ఎమన్ దేశస్థులైన అబ్దుర్ బాబు, సొలమన్ వెల్లడించినట్టు తెలిసింది. బెంగుళూరు, ముంబయిలో వీటిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా కొకైన్‌ను ఒక గ్రాము రూ 8 వేల చొప్పున అమ్ముతున్నట్టు నిందితులు తెలిపారు.
మళ్లీ తెరపైకి సినీ స్టార్ల డ్రగ్స్ కేసు
RELATED ARTICLES