అది మినహా మిగతా డిమాండ్లపై చర్చకు సిద్ధం
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన మూడు సాగు చట్టాలపై కేంద్రం మరోసారి తన మొండి వైఖరిని స్పష్టం చేసింది. ఈ చట్టాల రద్దును మినహాయించి, మిగతా డిమాండ్లపై రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశా రు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసేదిగా ఉన్న ఈ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఏడు నెలలకుపైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ, కేంద్రం పట్టించుకోవడం లేదు. సాగు చట్టాలను రద్దు చేసి, అన్ని రాజకీయ, రైతు సంఘాలతో చర్చించిన తర్వాత సరికొత్త చట్టాలను రూపొందించాలని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) కోరుతున్నది. ఆయితే, సాగు చట్టాల అమలును వాయిదా వేస్తామే తప్ప వాటిని రద్దు చేయడం కుదరదని ఈ ఏడాది జనవరి మాసంలో రైతు సం ఘాల ప్రతినిధులతో జరిగిన 11వసా రి జరిగిన చర్చల్లో తోమర్ తెలిపారు. అప్పటి నుంచి చర్చల్లో పురోభివృద్ధి లేకుండా పోయింది. రైతుల ఆందోళన ఉధృత రూపం దాలుస్తున్నప్పటికీ, కేంద్రం వైఖరిలో మార్పు లేదనడానికి తోమర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. వ్యవసాయ చట్టాల ను ఉపసంహరించుకోవడం మినహా మరే ఇతర డిమాండ్లు ఏవైనాసరే పరిగణనలోకి తీసుకుని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. రైతులతో ఇది వరకు జరిగిన చర్చల్లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశామని అన్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం మినహా రైతులు ఏ ప్రతిపాదన చేసినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇలావుంటే, సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది నవంబర్ 25 నుంచి ఢిల్లీ సరిహద్దులైన టిక్రి, ఘజియాబాద్, సింఘు కేంద్రాలుగా రైతులు ఆందోళనను నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా పలు రకాల నిరసనలు చేపడుతున్నారు. కానీ, కేంద్రం తన పంతాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరి కారణంగానే చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కొనసాగుతునే ఉంది. రైతులకు నాయం చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించడంతో కొంత ఆశాజనక వాతావరణం కనిపించినప్పటికీ, మంత్రి తోమర్ తాజా వాఖ్యలతో పరిస్థితి మళ్లీ మొదటి వచ్చిందనే అనుకోవాలి.
సాగు చట్టాల రద్దు అసాధ్యం
RELATED ARTICLES