బిజెపి ఆశలు గల్లంతు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) హ్యాట్రిక్ సృష్టించింది. 292 స్థానాలకు జరిగిన పోరులో టిఎంసి తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. బెంగాల్లో పాగా వేద్దామనుకున్న బిజెపిఆశలు గల్లంతయ్యాయి. కాలికి గాయం తగలడంతో, ఎన్నికల్లో ఒంటి కాలుతోనే బెంగాల్‌ను గెలుచుకుంటానని శపథం చేసినదీదీ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మరోవైపు బెంగాల్లో మమతకే మళ్లీ పట్టం అని వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం నూటికి నూరుశాతం నిజమైంది. తాజా ఫలితా ల సరళి నేపథ్యంలో, మోడీ ప్ర ధానమైన వ్యక్తి అయినంత మా త్రాన బిజెపి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి తీరాలన్న గ్యారంటీ ఏమీ లేదని టిఎంసి నిరూపించింది. ఆ పార్టీ విజయం దాదాపు ఏకపక్షమైంది. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించి, తమ ప్రచారాన్నిఅడ్డుకుందని, దీంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని మమత పలు సందర్భాల్లో ఆరోపించిన విషయం తెలిసిందే. బెంగాల్లో గెలవబోతున్నామంటూ బిజెపి పెద్దఎత్తున చేసిన ప్రచారం అభాసుపాలైంది. ఎన్నికల గోదాలో ఆ పార్టీ పల్టీ కొట్టింది. కాగా గత సంవత్సరకాలంగా, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించినప్పటినుంచి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతోపాటు పేరొందిన నాయకులంతా బెంగాల్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. అక్కడ విజయం సాధించాలన్న పట్టుదల ప్రదర్శించారు. మమతను అధికార పీఠంనుంచి దూరం చేసేందుకు వ్యూహరచన చేశారు. ప్రణాళికలు వేశారు. పావులు కదిపారు. సువేందు అధికారిని తమ వైపు తిప్పుకొన్నప్పటికీ అనుకున్నది సాధించలేకపోయింది. మరోవైపు బెంగాల్ కూతురునే ఆదరించాలంటూ మమత చేసిన ప్రచారానికి బెంగాల్ ప్రజలు సానుకూలంగా స్పందించారు. టిఎంసిని వరుసగా మూడోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టారు.
పశ్చిమబెంగాల్లో… టిఎంసి హ్యాట్రిక్
RELATED ARTICLES