ఢిల్లీ హైకోర్టు హెచ్చరిక
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ వ్యాప్తం గా కల్లోలం సృష్టిస్తుండగా, కొన్ని రకాల ఔషధాలతోపాటు ఆక్సిజన్ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కాగా, కొంద రు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ ఆరోపణలపై ఢిల్లీ హై కోర్టు తీవ్రంగా స్పందించింది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర అధికారుల్లో ఎవరైనా ఆక్సిజన్ తరలింపునుగానీ, సరఫరాను గానీ అడ్డుకుంటే ఉరితీస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ మహారాజా అగ్రసేన్ ఆసుపత్రి దాఖలు చేసి న పిటిషన్‌ను జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లితో కూడిన ధర్మాసనం విచారించిం ది. ఈ సందర్భంగా ధర్మాసనం విస్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకున్న ఒక్క సందర్భాన్ని తమ దృష్టికి తీసుకురావాలనీ సూచించింది. అం దుకు కారకుడైన వ్యక్తిని ఉరి తీస్తామని చెప్పింది. ఆక్సిజన్ సిలిండర్లను అడ్డుకుంటు న్న విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. ఆక్సిజన్ సిలిండర్లను ఎవరైనా అధికారులు అడ్డుకుంటున్నట్టు తెలిస్తే, ఆ వివరాలను కేంద్రానితో పంచుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. తద్వారా కేంద్రం తగిన చర్యలు తీసుకునే వీలుంటుందని పేర్కొంది.
ఈ ‘సునామీ’ని ఎలా ఎదుర్కొంటారు?
కరోనా వ్యాప్తిని సునామీగా ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అభివర్ణించింది. దీనిని ఏ విధంగా ఎదుర్కొంటారో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్ 19 కేసులు, మరణాలు పెరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వైరస్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చేనెల మూడోవారం నాటికి కరోనా తారస్థాయికి చేరుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ధర్మాసనం కోరింది.
‘ఆక్సిజన్’ను అడ్డుకుంటే ఉరి తీస్తాం
RELATED ARTICLES