లాస్ ఏంజెల్స్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన పర్సివరెన్స్ రోవర్ తన యాత్రలో ప్రధాన మైలురాయిని చేరుకుం ది. అది అంగారకుడి ఉపరితలంపై మొదటి టెస్ట్ డ్రైవ్ పూర్తిచేసింది. దాదాపు 6.5 మీటర్ల దూరం ప్రయాణించి ‘ప్రధానమైన మైలురాయి’ని చేరుకుంది. ఈ టెస్ట్ డ్రైవ్ సు మారు 33 నిమిషాలపాటు సాగింది. ఇందు లో మొదట నాలుగు మీటర్ల దూరం ముందుకు వెళ్లిన రోవర్, ఆ తర్వాత 150 డిగ్రీలు ఎడమకు తిరిగి, 2.5 మీటర్లు వెనక్కి వచ్చింది. అలా తన కొత్త తాత్కాలిక స్థలంలో ఆగిందని నాసా వెల్లడించింది. రోవర్ ఎలా కదులుతుందో తెలుసుకునేందుకు ఈ టెస్ట్ డ్రైవ్ ప్రయోగంలా ఉపయోగపడుతుంది. కాగా, ఇతర గ్రహాలపై చక్రాలున్న రోవర్లకు సంబంధించి టెస్ట్ డ్రైవ్ లాంటి పరీక్షలు కొన్ని ఉంటాయని పర్సీవరెన్స్ రోవర్ మొబిలిటీ టెస్ట్ బెడ్ ఇంజినీర్ అనాయిస్ జారిఫియన్ తెలిపారు. ‘చక్రాలను కదిలించి, పర్సీవరెన్స్ను తిరిగేలా చేసేందుకు ఇది తొలి అవకాశం. కాగా, ఆరు చక్రాల రోవర్ అద్భుతంగా స్పందించింది. వచ్చే రెండేళ్లలో విజ్ఞానశాస్త్రం మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లినా తట్టుకునేందుకు కావాల్సిన విశ్వాసం ఈ టెస్ట్ డ్రైవ్ వల్ల సమకూరింది’ అని జారిఫియన్ ధీమా వ్యక్తంచేశారు. సూక్ష్మజీవుల ఉనికి ఆనవాళ్లను వెతకడం సహా విజ్ఞానశాస్త్ర లక్ష్యాలను సాధించేందుకు రోవర్ పని మొదలుపెట్టిందంటే, దూరాన్ని క్రమంగా 200 మీటర్లకు పైగా విస్తరిస్తామని నాసా తెలిపింది. తన మిషన్లో భాగంగా పర్సీవరెన్స్ రోవర్ అంగారకుడి లోపలి పొరలను, గత కాలపు శీతోష్ణ స్థితిని గుర్తిస్తుంది. అంగారకుడిపైకి మానవ అన్వేషణకు బాటలు పరుస్తుంది. ఇంకా తొలిసారిగా అంగారకుడి రాళ్లను, మట్టిని సేకరిస్తుందని అంచనా. అంగారకుడిపై పరిశోధనల కోసం అమెరికా ప్రయోగించిన పర్సీవరెన్స్ రోవర్ ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆ గ్రహంపై దిగిన విషయం తెలిసిందే. కాగా అత్యాధునిక కెమెరాల ద్వారా తీసిన అంగారకుడి ఫొటోలను రోవర్ భూమికి పంపిస్తుంది.
పర్సీవరెన్స్ మొదటి టెస్ట్ డ్రైవ్ పూర్తి
RELATED ARTICLES