టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత
న్యూజిలాండ్‌తో తుదిపోరుకు సిద్ధం
అహమ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగవ, చివరి మ్యాచ్‌ని ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో కైవసం చేసుకున్న భారత్, ఈ టెస్టు సిరీస్‌ను 3 ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకుంది. అంతేగాక, అంతర్జాతీయ క్రికెట్ మం డలి (ఐసిసి) ప్రపంచ చాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్లింది. ఇక టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ కోసం న్యూజిలాండ్‌తో ఫైనల్ పోరును ఖాయం చేసుకుంది. కాగా, అక్షర్ పటేల్, అశ్విన్ స్మిన్ మాయకు తలవంచిన ఇంగ్లాండ్ చివరి టెస్టులో ఏ దశలోనూ భారత్‌కు గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 75.5 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్‌లో బెన్ స్టోక్స్ (55), డానియల్ లారెన్స్ (48) మినహాయించి, మిగతా వారు ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 68 పరుగులకు 4, అశ్విన్ 47 పరుగులకు 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 365 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (49) మినహాయిస్తే, టాప్ ఆర్డర్ విఫలంకాగా, మిడిల్ ఆర్డర్‌లో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ సెంచరీతో కదంతొక్కి భారత్‌ను ఆదుకున్నాడు. తను 101 పరుగులు సాధించగా, వాషింగ్టన్ సుందర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 43 పరుగులు చేయడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 89 పరుగులకు 4, జేమ్స్ ఆండర్సన్ 44 పరుగులకు 3 వికెట్లు సాధించారు. జాక్ లీచ్‌కి రెండు వికెట్లు లభించాయి. మొత్తం మీద మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 160 పరుగులు వెనుకంజలో నిలిచిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. డానియల్ లారెన్స్ 50 పరుగులతో జట్టును ఆదుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్షర్ పటేల్ 48 పరుగులకు 5, అశ్విన్ 47 పరుగులకు 5 వికెట్లు తమ ఖాతాలో వేసుకొని, ఇంగ్లాండ్ పరాజయాన్ని శాసించారు.
ఇంగ్లాండ్‌పై టీమిండియా ఇన్నింగ్స్ విజయం
RELATED ARTICLES