బలపరీక్షకు ముందురోజు ఇద్దరు ఎంఎల్‌ఎలు రాజీనామా
పుదుచ్చేరిలో మైనారిటీలో పడిన కూటమి ప్రభుత్వం
సిఎం నారాయణస్వామి భవితవ్యం తేలేది నేడే
పుదుచ్చేరి : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు వేగం గా మారుతున్నాయి. ఇప్పటికే నలుగురు శాసససభ్యులు పదవులకు రాజీనామాలు సమర్పించ గా.. మరో సభ్యుడిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే మరో ఇద్దరు ఎంఎల్‌ఎలు అధికార కాంగ్రెస్ కూటమికి షాక్‌నిచ్చారు. బలపరీక్షకు ముందు రోజు సిఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, కాంగ్రెస్ సభ్యుడు లక్ష్మీనారాయణన్, డిఎంకె ఎంఎల్‌ఎ వెంకటేషన్ ఆదివారం రాజీనామా చేశారు. దీంతో 33 అసెంబ్లీలో అధికార కూటమి బలం 11కు పడిపోయింది. ప్రతిపక్షాలకు 14 మం ది ఎంఎల్‌ఎలు ఉన్నారు. మరో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లక్ష్మినారాయణన్, వెంకటేషన్‌లు తమ రాజీనామాలను వేర్వేరుగా స్పీకర్ విపి శివకొలుంధుకు ఆయన నివాసంలో సమర్పించారు. లక్ష్మినారాయణన్ విలేకరులతో మాట్లాడతూ నారాయణస్వామి నేతృత్వంలోని ఈ ప్రభుత్వ మెజారిటీని కోల్పోయిందన్నారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానన్నారు. అదే విధంగా వెంకటేషన్ కూడా మీడియాతో మాట్లాడుతూ తాను కేవలం ఎంఎల్‌ఎ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, డిఎంకెలోనే కొనసాగుతానని చెప్పారు. శాసనసభ్యుడి స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి కింద ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో తన నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చలేకపోయానన్నారు. ఇదిలా ఉండగా, మాజీమంత్రి ఎ. నమశివాయం (ఇప్పుడు ఆయన బిజెపిలో ఉన్నారు), మల్లాడి కృష్ణారావు సహా నలుగురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజీనామా చేశారు. మరో ఎంఎల్‌ఎపై అనర్హత వేటు పడింది. కాగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈనెల 22న బలపరీక్ష నిర్వహించి తన బలాన్ని నిరూపించుకోవాలని సిఎం నారాయణస్వామిని ఆదేశించారు. తాజాగా ఇద్దరు ఎంఎల్‌ఎలు రాజీనామా చేసిన నేపథ్యంలో అధికార పార్టీ సభ్యులు సిఎంను కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు నారాయణస్వామి నివాసానికి వెళ్లారు. అయితే ఈనెల 18న కూడా చర్చిలు జరిపినప్పటికీ ఫలితం లేదు.
కాంగ్రెస్ కూటమికి షాక్
RELATED ARTICLES