విద్యా సంస్థల ప్రారంభంపై స్పష్టత?
ప్రజాపక్షం / హైదరాబాద్ విద్యా సంస్థలు, రెవెన్యూ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీపై కార్యాచరణను ప్రభుత్వం ఖరారు చేయనుంది. రెవెన్యూ, వైద్యం, విద్య, మున్సిపల్, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖలకు చెందిన ముఖ్యమైన అంశాలపై హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించే ఏజెండాకు సంబంధించిన పలు అంశాలపై అధికార యంత్రాంగం తగిన సమాచారాన్ని సిద్ధం చేసుకుని రావాలని ఇప్పసటికే సిఎం కెసిఆర్ ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ తరగతులకు విద్యాబోధనను ప్రారంభించాలి?, మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు తదితర అంశాలపై ప్రభుత్వం ఇదివరకే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. రెవెన్యూకు సంబంధించిన పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్స్ ఏర్పాటు, పార్ట్ – బి.లో చేర్చిన అంశాల పరిష్కారాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇందులో పలు సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణను కూడా నిర్ణయిస్తారు. అలాగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షిస్తారు.
నేడు జిల్లా కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమావేశం
RELATED ARTICLES