ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ 19 వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నాం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనాకు విరుగుడుగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం దేశంలో మొదలు కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తెలిపారు. పరిమితమైన అత్యవసర వినియోగానికి రెండు టీకాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుంచి ఆదివారం ఆమోదం లభించిం ది. ‘భారత్‌లో తయారైన’ టీకాలకు గాను ప్రధాని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ప్రశంసించా రు. దేశం వారిని చూసి గర్విస్తుందని అన్నా రు. సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన ఆక్స్‌ఫర్డ్ కొవిడ్ 19టీకా కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలకు దేశంలో పరిమిమైన అత్యవసర వినియోగానికి ఆదివారం అనుమతులు లభించాయి. అలా భారీ టీకా కార్యక్రమానికి బాట పడింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఉత్పత్తి పరిమాణంతో పాటు, ఉత్పత్తి నాణ్యత కూడా ముఖ్యమని ఆయన అన్నారు. ఏ పురోగామి సమాజానికైనా పరిశోధనే కీలకం. అది ప్రభావవంతం గా ఉండి, దాని ప్రభావాలు వ్యాపారపరంగా, సామాజికంగా ఉంటాయి. అవి మన విధానాన్ని, ఆలోచనను విస్త్రృతం చేయడంలో సహాయపడతాయి. మనం ప్రపంచాన్ని మన ఉత్పత్తులతో నింపాలనుకోవడం లేదు. కానీ ప్రపంచం మూలమూలలోని భారతీయ వస్తువుల కొనుగోలుదారుల గుండెలు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో నాణ్యమైన సేవలు, నాణ్యమైన ఉత్పత్తులే ప్రపంచంలో భారత్ బలాన్ని పట్టిచూపుతాయని ఆయన అన్నారు. విజ్ఞానశాస్త్రాన్ని ప్రోత్సహించే ప్రయత్నంతోనే చారిత్రకంగా ఒక దేశ పురోగతి ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దీనిని ఆయన విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, పరిశ్రమల ‘విలువను సృష్టించే చక్రం’గా పేర్కొన్నారు. శాస్త్ర పరిశోధనలు సాంకేతికతను సృష్టిస్తాయి. దాంతో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది. పరిశ్రమలు కొత్త పరిశోధనల కోసం మళ్లీ విజ్ఞానశాస్త్రం మీద పెట్టుబడులు పెడతాయని ఆయన అన్నారు. దేశం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సమయంలో భారీ ఉత్పత్తి దిశగా ఈ విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన విలువను సృష్టించే చక్రం ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ప్రధానమైందిగా మారిందని ఆయన అన్నారు. ఇందులో సిఎస్‌ఐఆర్ తనవంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ప్రధాని మోడీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా నేషనల్ అటామిక్ టైం స్కేల్, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిని జాతికి అంకితం చేశారు. ఇంకా నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ స్టాండర్డ్ లేబరేటరీకి (జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాల) శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలోని సిఎస్‌ఐఆర్ నేషనల్ ఫిజిక్స్ లేబరేటరీ 75వ ఆవిర్భావ దినం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రధాని ఈ ప్రసంగం చేశారు.
టీకాలకు రెడీ
RELATED ARTICLES