ప్రేమ జంట ఆత్మహత్య
ప్రేమ పేరుతో విలువైన ప్రాణాలను తీసుకున్న యువత
ప్రజాపక్షం/గార్ల మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజుతండా పంచాయతీ పరిధిలోని వడ్లఅమృతం డాకు చెందిన గుగులోత్ మోహన్ ఆశల కుమారుడు ప్రశాంత్ (15) అదే గ్రామానికి చెందిన భూక్య మంగిలాల్ కూతురు ప్రవీణ (22) అనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత ప్రేమ జంట ఒకరి నొకరు ప్రేమించుకుంటున్నారని, విషయం బంధువులకు తెలిసి వారిని పలుమార్లు వారించినట్లు తెలిపారు. దీంతో పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెబుతారనే నెపంతో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సోమవారం సాయంత్రం నుండి ఈ జంట కనిపించకపోవడంతో అన్ని చోట్లా వేతకగా బుదవారం ఉదయం ఊరికి దగ్గరలో ఉన్న బావిలో విగతజీవులై కనిపించారు. విషయం తెలుకున్న ఇరువురి తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకోగా, వారి ఆర్తనాదాలు అందరిని కలిచేవేశాయి. ఘటనపై స్థానిక ఎస్ఐ బాదావత్ రవి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అబ్బాయి టెన్త్… అమ్మాయి డిగ్రీ
RELATED ARTICLES