8 కోట్ల మంది బలవంతపు నిరాశ్రయులు
ఘర్షణలు, కొవిడ్ మహమ్మారి ప్రధాన కారణాలు
ఐక్యరాజ్య సమితి: కొట్లాటలు, కొవిడ్ 19 ప్రభా వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2020 మధ్య నాటికి 8 కోట్ల మంది బలవంతంగా నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్య సమితి (ఐరాస) నివేదిక వెల్లడించింది. దీనిని ఐరాస కాందిశీకుల సంస్థ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్హెచ్సిఆర్) జెనీవాలో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభం నాటికి హింస, కొట్లాటలు, మా నవ హక్కుల ఉల్లంఘన కారణంగా 7 కోట్ల 95 లక్షల మంది తమ స్వస్థలాలను వదిలిపెట్టా ల్సి వచ్చింది. వీరిలో అంతర్గతంగా నిరాశ్రయులైన వాళ్లు 4 కోట్ల 57 లక్షలు ఉండగా, 2 కోట్ల 96 లక్షల మంది కాందిశీకులుగా తమదేశం విడిచిపెట్టినవాళ్లు ఉన్నారు. మరో 42 లక్షలు శరణార్థులు గా ఉన్నారు. మొత్తం నిరాశ్రయుల్లో 3 కోట్ల నుం చి 3 కోట్ల 40 లక్షల మంది (అంటే 38% నుంచి 43%వరకు) 18 ఏళ్ల లోపు బాలలే ఉండటం గమనార్హం. సిరియా (66 లక్షలు), వెనెజులా (37 లక్షలు), అఫ్ఘానిస్తాన్ (27 లక్షలు), దక్షిణ సూడాన్ (23 లక్షలు), మయాన్మర్ (10 లక్షలు) ఐదు దేశాల నుంచే ఎక్కువమంది నిరాశ్రయులు ఉన్నారు. ఇక వీరికి ఆశ్రయం ఇచ్చిన దేశాల్లో 36 లక్షల మందిలో టర్కీ మొదటి స్థానంలో ఉండగా, 18 లక్షలతో కొలంబియా రెండో స్థానంలో ఉంది. నిరాశ్రయులను పంపించేందుకు ఒత్తిడి ఉన్నప్పటికీ కొవిడ్ 19 వారికి అదనపు రక్షణగా అవతరించింది. ప్రపంచ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా జీవనోపాధి సంక్షోభం ముందు వరసకు రావడం కూడా దీనికి మద్దతుగా నిలిచింది. బలవంతంగా నిరాశ్రయులైన వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను కొవిడ్ మరింత క్షీణింపజేసిందని ఆ నివేదిక తెలిపింది. ఏప్రిల్లో మొదటి దశ కొవిడ్ ప్రబలంగా ఉన్న సమయంలో 168 దేశాలు తమ సరిహద్దులను పూర్తిగానో, పాక్షికంగానో మూసివేశాయి. దాంతో 90 దేశాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి మరో మార్గం లేకుండా పోయింది. అప్పటినుంచి వైరస్ కట్టడికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. ప్రపంచం మహమ్మారితో పోరాడుతున్న సమయంలో కాల్పుల విరమణ పాటించాల్సిందిగా గత మార్చిలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తిచేశారు. హింస కారణంగా సిరియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, సొమాలియా, యెమెన్ దేశాల నుంచి 2020 ప్రథమార్ధంలో నిరాశ్రయులు ఎక్కువగా ఉన్నారు. హింస, అత్యాచారాలు, మరణదండనల కారణంగా ఆఫ్రికాలోని మధ్య సాహేల్ ప్రాంతంలో కూడా ప్రజలు ఎక్కువగా నిరాశ్రయులు కావడం కనిపిస్తుంది. ప్రపంచ నేతలు యుద్ధాలు ఆపేవరకు నిరాశ్రయులు కావడం కొనసాగుతూనే ఉంటుందని యుఎన్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఫిలిపో గ్రాండి పేర్కొన్నారు. ఇక శరణార్థులుగా ఉండేందుకు చేసుకునే అప్లికేషన్లు కూడా 2019త పోల్చితే మూడోవంతు తగ్గిపోయాయి. అయితే ప్రపంచంలో యుద్ధాలకు దారితీసే అంతర్గత కారణాలు మాత్రం అలాగే ఉన్నాయని నివేదిక పేర్కొంది. గడచిన సంవత్సరాలతో పోల్చితే 2020లో నిరాశ్రయుల కోసం తక్కువ పరిష్కారాలు కనుక్కొన్నారని నివేదిక వ్యాఖ్యానించింది. ఇక నిరాశ్రయుల్లో తిరిగి తమ ఇళ్లకు చేరుకున్న వాళ్ల సంఖ్య కేవలం 8,22,600. వీరిలో 6,35,000 మంది అంతర్గతంగా నిరాశ్రయులైన వాళ్లు కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రథమార్ధంలో 1,02,600 మంది స్వచ్ఛందంగా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. 2019తో పోల్చితే ఇది కేవలం 22% మాత్రమే. కొవిడ్ పరిమితుల కారణంగా నిరాశ్రయుల పునరావాసం మార్చి నుంచి జూన్ వరకు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫలితంగా 2020 మొదటి ఆరు నెలల్లో 17,400 మందికి మాత్రమే పునరావాసం కల్పించడం జరిగింది. 2019తో పోల్చితే ఇది సగమే. ఇక దిక్కూమొక్కూ లేని (స్టేట్లెస్) ప్రజల వాస్తవ సంఖ్య ఎంతన్నది తెలియదు. అయితే 42 లక్షల మంది దిక్కూమొక్కూ లేని ప్రజల తమ దగ్గర ఉన్నారని 79 దేశాలు వెల్లడించాయని యుఎన్హెచ్సిఆర్ తెలిపింది.
నిలువ నీడ లేదు!
RELATED ARTICLES